అందరు మెచ్చిన బుల్లితెర నటుల్లో అతడే నెంబర్ వన్.. నాగార్జునను కూడా వెనక్కి నెట్టిన కుర్రాడు!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి దేశ ప్రజలందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు దేశ వ్యాప్తంగా సినీ తారలు, సినిమాలు, వాటి ఫలితాల గురించి సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే తాజాగా 2023 డిసెంబర్ నెలకు సంబంధించిన తెలుగు టెలివిజన్ నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీస్ జాబితాను రిలీజ్ చేసింది. అయితే అందులోని టాప్ 5 లిస్టును చూస్తే షాకవ్వాల్సిందే. ఎందుకంటే హీరోను మించి ఓ కమెడియన్ టాప్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. అలాగే ఓ కామన్ మాన్ టాప్ 5లో నిలిచాడు. అయితే ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారు, టాప్ 1లో ఉన్న ఆ కమెడియన్ ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అందరూ మెచ్చిన బుల్లితెర నటుల్లో మొదటి స్థానంలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఉన్నారు. ఆర్మాక్స్ నిర్వహించిన సర్వేలో టాప్ 1 స్థానాన్ని దక్కించుకోవడం హైపర్ ఆదికి ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ చాలా సార్లు ఆయన టాప్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. కానీ ఈసారి టాప్ 2లోకి హీరో అక్కినేనా నాగార్జున రావడంతో అంతా షాకవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో సెకండ్ ప్లేస్ లో ఉంటే ఒక కమెడియన్ టాప్ 1లో ఉండడాన్ని చూసి ష్క్ అవుతున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హోస్ట్ గా చేసిన ఈయనకు బుల్లితెర ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.

ఇలా హీరో అక్కినేని నాగార్జున రెండో స్థానాన్ని సంపాధించుకున్నారు. ఇక టాప్ 1లో నిలిచిన హైపర్ ఆది.. జబర్దస్త్ షోలో ఓ టీమ్ మెబర్ గా కెరియర్ ప్రారంభించి.. ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారిపోయాడు. ఆ తర్వాత నుంచి ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, పలు ఈవెంట్స్, చివరకు సినిమాల్లో కూడా కనిపిస్తూ తెగ అలరిస్తున్నాడు. అనేక షోలలో యాంకర్ గా కూడా కనిపిస్తూ రచ్చ చేస్తున్నాడు. ఇక మూడో స్థానంలో యాంకర్ ప్రదీప్ ఉన్నాడు. యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఈయన అనే షోలకు హోస్ట్ గా చేశాడు. అలాగే పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు. ప్రస్తుతం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఇష్టపడే యాంకర్ గా దూసుకెళ్తున్నాడు.
మరోవైపు సుడిగాలి సుధీర్ నాలుగో స్థానం దక్కించుకున్నాడు. ఈయన కూడా జబర్దస్త్ షోలో టీమ్ మెంబర్ గా వచ్చి టీమ్ లీడర్ అయ్యాడు. ఆ తర్వాత యాంకర్ గా మారి సందడి చేశారు. ఓవైపు ఇవన్నీ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో హీరోగా కూడా చేస్తూ కెరియర్ లో దూసుకెళ్తున్నాడు. ఇలా బుల్లితెరపై అటు సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూ ట్రెండింగ్ లోనే ఉంటున్నాడు. ఇక చివరి స్థానంలో అంటే టాప్ 5 స్థానంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ విన్నర్ నిలిచాడు.

కామన్ మాన్ అయిన ఇతడు.. టిక్ టాక్, ఇన్ స్టా, యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తూ గుర్తింపు పొందాడు. ఇక బిగ్ బాస్ కు వెళ్లి రైతుబిడ్డను అని చెప్పుకుంటూ.. ఆట కూడా చక్కగా ఆడుతూ అందరి మనసులు గెలిచాడు. బిగ్ బాస్ షో అయిపోయి నెల గడుస్తున్నా ఈయన ఇంకా టాప్ లోనే ఉన్నారు.


Click it and Unblock the Notifications











