మహేష్ బాబు పేరు మీద హోమాలు, పూజలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన స్టార్ డైరెక్టర్..
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ 'వారణాసి' (Varanasi)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను మహేష్ అభిమానులే కాకుండా యావత్తు సినీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు కెరీర్‌లో కీలకమైన పాత సినిమాలపై చర్చ మళ్లీ మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మైలురాయిగా నిలిచిన 'మురారి' (Murari Re-Release) మూవీ డిసెంబర్ 31న రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇంతకీ ఆ షాకింగ్ విషయాలేంటీ?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్ని బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు ఉన్నా.. ఆయన కెరీర్ లో ఎప్పటికీ గుర్తిండిపోయే మెమరబుల్ సినిమాలలో 'మురారి' ఒకటి. 2001లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ మూవీ.. మహేష్ లోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించడామే కాదు, టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన ఈ మూవీ.. ఈ క్లాసిక్ కల్ట్ మురారీ మూవీ డిసెంబర్ 31న రీ-రిలీజ్ (Murari re release) కాబోతోంది. ఈ సందర్భంగా కృష్ణవంశీ సోషల్ మీడియా వేదికగా సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు.

అమ్మవారి శాపం తగలడం వల్ల ఒక వంశం ఎలా దెబ్బతిందనే కథాంశంతో 'మురారి' సినిమా రూపొందింది. ఒక జమీందారు 19వ శతాబ్దంలో చేసిన తప్పుకి, ప్రతీ 48 ఏళ్ళకొకసారి అతని వంశస్తుల్లో ఒకరిని బలితీసుకుంటున్న తరుణంలో.. మురారి మరణం నుంచి ఎలా తప్పించుకోగలిగాడు? అమ్మవారి శాపాన్ని ఎలా నివారించి తన వంశాన్ని కాపాడుకున్నాడు? అనేదే ఈ సినిమా కథ. ఇందులో మహేష్ బాబు యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన పెర్ఫామెన్స్ నెక్స్ట్ లెవల్ అంతే. క్లైమాక్స్ గురించి కృష్ణవంశీ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు.
దళపతి విజయ్‌కు ఊహించని అనుభవం.. ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా బాబు !
కథలో భాగంగా సినిమా చివర్లో మురారి మరణించకుండా ఉండటానికి వేదపండితులు మృత్యుంజయ హోమం చేస్తారు. ఐతే ఆ సన్నివేశం కోసం నిజమైన వేద పండితులను పిలిపించి.. మురారి పేరు మీద కాకుండా 'ఘట్టమనేని మహేష్ బాబు' పేరు మీదే హోమం చేయించినట్లు కృష్ణవంశీ వెల్లడించారు. మూడు గంటల పాటు ఎంతో నిష్టగా ఈ హోమం చేయించినట్లు ఆయన తెలిపారు. హోమం జరుగుతుండగా మధ్యలో అక్కడక్కడా కొన్ని షాట్స్ తీశామని తెలిపారు. ఆఖర్లో పూర్ణాహుతిని నిజంగానే మహేష్ బాబుతో చేయించామని.. దాన్నే సినిమాలో ప్రేక్షకులు చూశారని దర్శకుడు చెప్పారు.సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ గురించి కూడా వివరించారు.
అలానే క్లైమాక్స్ లో సంకల్పం దృశ్యం, రకరకాల భావాలతో ఏకథాటిగా నాలుగు పేజీల ఏక పాత్రాభినయం, అష్టావధానం సన్నివేశాలను చిత్రీకరించామని కృష్ణవంశీ తెలిపారు. ఓవైపు మృత్యువుకు దగ్గరగా ఉన్నాననే నిజాన్ని మురారి అర్థం చేసుకోవాలి, మరోవైపు శబరిని కుటుంబ సభ్యులను ఓదార్చాలి, ఇంకోవైపు ప్రేయసి వసుంధర డేంజర్ లో ఉందనే ఆందోళన చూపించాలి, తన గురించి ఆందోళన పడుతున్నా కుటుంబ సభ్యులతో ధైర్యం నింపేలా మాట్లాడాలి.. ఇదంతా చాలా ఎంగేజింగ్ గా చెప్పాలి. ఈ సన్నివేశం నటుడిగా మహేష్ బాబుకి, దర్శకుడిగా తనకు అతి పెద్ద ఛాలెంజ్ అని కృష్ణవంశీ తెలిపారు. ఆ సీన్ లో మహేష్ ఇరగదీసేశాడు, దుమ్మురేపాడు.. హ్యాట్సాఫ్ అని కొనియాడారు.
ప్రస్తుతం డైరెక్టర్ కృష్ణవంశీ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. వారణాసి మూవీకి ముందు మురారి సినిమాను రీ రిలీజ్ చేయడం చూస్తుంటే.. ఇన్ డైరెక్టర్ ప్రమోషన్స్ లా అనిపిస్తుందని టాక్. మరి మురారీ రీ-రిలీజ్ ఎలాంటి రికార్డులను నెలకొల్పుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











