‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో జాయిన్ అయిన నభ నటేష్
ఎనర్జిటిక్ హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో 'మిస్టర్ మజ్ను' ఫేం నిధి అగర్వాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సెకండ్ హీరోగా నబా నటేష్‌ను ఫైనల్ చేస్తూ.. చిత్ర బృందం మరో పోస్టర్ విడుదల చేసింది.
సుధీర్ బాబు మూవీ 'నన్ను దోచుకుందువటే' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నబా నటేష్ 'ఇస్మార్ట్ శంకర్' ద్వారా టాలీవుడ్లో రెండో అవకాశం దక్కించుకున్నట్లయింది. ఇంతకు ముందు ఆమె కన్నడలో మూడు చిత్రాలు చేసింది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న 'ఇస్మార్ట్ శంకర్ ' షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. హైదరాబాద్‌లో ఫైన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. .'డబుల్ ధమాకా దిమాక్ ' అనే క్యాప్షన్ తో సినిమా వస్తుండగా సరికొత్త హెయిర్ స్టైల్, గడ్డంతో రామ్ ఈ సినిమాలో కనిపించనున్నారు.

ఈ సినిమాలో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా, రాజ్ తోట సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు. పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సమర్పణ: లావణ్య, ఆర్ట్ డైరెక్టర్ : జానీ షైక్, ఎడిటర్ : జునైద్ సిద్ధిఖి, పాటల రచయిత: భాస్కరభట్ల, ఫైట్స్ : రియల్ సతీష్.


Click it and Unblock the Notifications











