Don't Miss!
- News ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా బొత్సా కీలక ప్రకటన..!!
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇస్మార్ట్ పిల్ల లగ్జరీ కారు.. స్టార్ హీరోయిన్స్ రేంజ్లో ఏకంగా!
ఇటీవలే విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్న నభా నటేష్ లగ్జరీ కారును సొంతం చేసుకుంది. ఈ మేరకు సదరు కారు పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది నభా. ఇస్మార్ట్ విజయాన్ని ఈ రకంగా ఎంజాయ్ చేస్తూ సూపర్ జోష్ లో కొత్త సినిమాలకు కమిట్ అవుతోంది నభా నటేష్.
రెడ్ కలర్ మెర్సిడిస్ బెంజ్ కారును కొనుగోలు చేసిన నభా నటేష్.. కారు ముందు నిలబడి సెక్సీగా ఫోజులిచ్చింది. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన కిక్ అమ్మడి దశను మార్చేసింది. పూరీ జగన్నాథ్ సినిమాలో నటించే అవకాశం వస్తే చాలు హీరోయిన్ల కెరీర్ దూసుకుపోతుందని టాలీవుడ్లో టాక్ ఉన్న సంగతి తెలిసిందే. అది అక్షరాలా నిజమని నిరూపించింది ఇస్మార్ట్ పిల్ల నభా నటేష్.
'నన్ను దోచుకుందువటే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత వరుస సినిమాలతో బిజీ అయింది. బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమా నభా కెరీర్ కి బాగా ప్లస్ అయింది. మాస్ క్యారెక్టర్ తో పాటు హాట్ అందాలతో మెస్మరైజ్ చేస్తూ సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది ఈ ఇస్మార్ట్ సుందరి.
ఇక ప్రస్తుతం రవితేజ సరసన 'డిస్కో రాజా' సినిమాలో నటిస్తోంది నభా నటేష్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్ రాజ్పుత్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో నభా చేస్తున్న క్యారెక్టర్ ఆమె పాపులారిటీని రెట్టింపు చేయనుందని టాక్.