నాగార్జున వల్ల కన్నీళ్లు పెట్టుకున్న చక్రి.. అప్పటి నుంచి పూరీకి దూరం!
కింగ్, అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో ఇప్పటికీ సీనియర్ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. యంగ్ హీరోలకు పోటీగా సినిమాల్లో నటిస్తూ మెపిస్తున్నారు. చివరిగా 'బంగార్రాజు' చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక నెక్ట్స్ అక్కినేని నాగార్జున తన ఫోకస్ భారీ చిత్రాలపై పెట్టినట్టు తెలుస్తోంది. చివరిగా 'నా సామీ రంగ' చిత్రంతో అలరించారు. ఆ తర్వాత కోలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న 'కూలి' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
నాగార్జున తన కెరీయర్ లో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చారు. డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను దర్శకుడిగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. అలాగే ఎంతో మంది నటీనటులకు ఆయన సహకారం అందింది. ఇక ప్రస్తుతం పాపులర్ రియాలిటీ గేమ్ షో 'బిగ్ బాస్ తెలుగు' ద్వారా కూడా సెలబ్రెటీలను స్టార్ లుగా మార్చుతున్న సంగతి తెలిసిందే. కానీ నాగార్జున వల్ల టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయాన్నే స్వయంగా మ్యూజిక్ డైరెక్టరే చెప్పడం గమనార్హం.

అయితే నాగార్జునతో కలిసి పనిచేయాలని ఎంతో మందికి ఆశగా ఉంటుంది. టాలీవుడ్ లో అగ్రహీరో కావడంతో ఆయన సినిమాలకు పనిచేయాలని అందరూ ఆశిస్తుంటారు. ఇక సంగీత దర్శకుడు చక్రి కూడా అలాగే అనుకున్నారంట. గతంలో పూరీ జగన్నాథ్ - నాగార్జున కాంబినేషన్ లో 'సూపర్' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పూరీ జగన్నాథ్ సినిమాలకు 'బాచీ' నుంచి పూర్తిగా చక్రినే సంగీతం అందిస్తూ వచ్చారు. యువరాజా, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, ఆంధ్రవాలా, 143 వంటి చిత్రాలకు చక్రి ఎవర్ గ్రీన్ మ్యూజిక్ అందించారు.
కాగా, ఆ తర్వాత నాగార్జునతో పూరీ జగన్నాథ్ 'సూపర్' చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ సంగీత దర్శకుడిగా చక్రిని ఎంపిక చేశారంట. కానీ నాగార్జున మాత్రం హిందీ మ్యూజిక్ కంపోజర్ సందీప్ చౌటాకు అవకాశం ఇవ్వడంతో ఫస్ట్ టైమ్ పూరీతో చక్రికి దూరం ఏర్పడిందంట. ఆ క్షణం చాలా బాధ అనిపించిందని చక్రి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కూడా. ఆ తర్వాత నుంచి చక్రికి పూరీ కాంబినేషన్ దెబ్బతిందని సినీ ప్రియులు అంటుంటారు. ఏదేమైనా చక్రి తన కెరీయర్ లో మాత్రం గుర్తుండిపోయే పాటలను అందించారు. 60కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు.
తాజాగా యూట్యూబ్ మ్యూజిక్ లో 'తు మేరా లవర్' అనే సాంగ్ వచ్చింది. ఆ పాట మాస్ మహారాజా రవితేజ - శ్రీలీలా జంటగా నటించిన 'మాస్ జాతర' సినిమాలోనిది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సంగీత దర్శకుడు చక్రి కంపోజ్ చేసిన గోల్డెన్ సాంగ్ 'చూపుల్తో గుచ్చి గుచ్చి సంపకే' సాంగ్ ను రీక్రియేట్ చేశారు. తు మేరా లవర్.. అనే టైటిల్ తో తాజాగా విడుదల చేశారు. సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. దీంతో సంగీత దర్శకుడు చక్రిని అందరూ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











