ఏపీలో మంత్రులందరూ దారుణంగా ఓటమి.. నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో పది రోజులపాటు సింగిల్ థియేటర్లు మూత వేయాలని నిర్ణయం తీసుకోవడంపై నిర్మాత నట్టి కుమార్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సినిమా థియేటర్స్‌ను తాత్కాలికంగా మూసివేసేందుకు నిర్ణయించడం షాక్ కు గురిచేసిందని ఆయన అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో జరిగిన ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓటమి పాలు అవుతారనేది ప్రస్తుతం అంచనాలు మాత్రమే. నేను ఈ ఎన్నికల సందర్భంగా ఇచ్చాపురం నుంచి పిఠాపురం వరకు తిరగాను. క్షేత్రస్థాయిలో రిపోర్టు తీసుకొన్నాను. అయితే ఏపీలోని మంత్రులందరూ ఓడిపోవడం ఖాయం అని నట్టి కుమార్ జోస్యం చెప్పారు.

పిఠాపురం ఓటు విలువ 1.6 లక్షల రూపాయలు.. ఓటు కోసం డబ్బుకు వెనుకాడని ఎన్నారై యువకుడు
విధేశాల నుంచి వచ్చి ఓటు వేసిన ప్రతీ ఒక్కరు... ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఉద్దేశంతోనే వచ్చారు. ప్రభుత్వ క్యాబినెట్‌లోని దాదాపు మంత్రులందరూ ఓడిపోతున్నారు. అందుకే వైసీపీ వర్గం కూటమి అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. ఇక మంత్రులందరికి శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాల్సిందే అని ఆయన ఘాటుగా స్పందించారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి దృష్టిపడిన పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ విజయం సాధించబోతున్నారు. అక్కడ పోలైన ఓట్లలో 90 శాతానికిపైగా ఓట్లు ఆయనకే పడ్డాయి. అల్లు అర్జున్ సపోర్ట్ చేయనంత మాత్రాన వచ్చిన నష్టమేమి లేదు. అతని విజ్ఞతకే వదిలేస్తున్నాం అని నట్టి కుమార్ అన్నారు.

నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన అల్లు అర్జున్‌ను ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు.
అర్జున్ అలా వేరొకరికి మద్దతు ఇవ్వడం నాకు నచ్చలేదు. అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఈ విషయంలో మరోసారి ఇలాంటివి జరగకుండా బన్నీ కూడా ఆలోచించాలి.. మీ ఫోటోను వారి పార్టీకి అనుగుణంగా సోషల్ మీడియాలో తిప్పుకున్నారు అని నట్టి సూచించారు.
థియేటర్లలో ఆక్యుపెన్సీ తగినంత లేని కారణంగా థియేటర్స్ ను బంద్ చేస్తున్నట్లు అసోసియేషన్ తెలిపింది. ఎన్నికల హడావుడి దేశమంతా ఉంది. నేను అడిగేది ఒక్కటే. మీరేలా ఒక్కరే నిర్ణయం తీసుకుంటారు. ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి వంటి వాటితో చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. థియేటర్స్ మూస్తే ఇబ్బందికరం అని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











