మొదట మెసేజ్.. ఆ తర్వాత వరుస కాల్స్.. మాటల్లో చెప్పలేను: నిధి అగర్వాల్
నిధి అగర్వాల్.. ఈ అమ్మడు కెరీర్ లో ఉన్నవి మూడే మూడు సినిమాలు. అందులో తొలి రెండు పెద్దగా సక్సెస్ కాలేదు.. మూడో సినిమా 'ఇస్మార్ట్ శంకర్' మాత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో నిధి అగర్వాల్ క్రేజీ హీరోయిన్‌గా మారింది. రామ్ గోపాల్ వర్మ కూడా నిధి అందాలకు ఫిదా అయిపోయాడు. గ్లామర్ డోస్ వడ్డించడంలో తనను మించిన హీరోయిన్ లేదన్నట్లుగా నిధి ఇచ్చిన ట్రీట్ యూత్ ఆడియన్స్ ని థియేటర్లకు పరుగులు పెట్టిస్తోంది. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండటంతో ఆనందంగా ఉన్న నిధి అగర్వాల్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు విశేషాలు పంచుకుంది.
రొమాంటిక్ సినిమాలంటేనే ఎక్కువ ఇష్టం అని నిధి అగర్వాల్ అంటోంది. రొమాంటిక్ సినిమాలు, సన్నివేశాల్లో నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె పేర్కొంది. మొదటిసారి తాను 'ఇస్మార్ట్ శంకర్' రూపంలో మాస్ మసాలా సినిమా చేశానని, మాస్ పవర్ ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారానే తనకు తెలిసిందని చెప్పింది నిధి అగర్వాల్. తెలుగులో తాను అందుకున్న తొలి విజయం ఇదేనని, మొదటిసారి సక్సెస్ టేస్ట్ గురించి మాటల్లో చెప్పలేనని పేర్కొంది. అయితే 'ఇస్మార్ట్ శంకర్' విడుదలయ్యాక తాను విజయవాడలో ఉండగా కంగ్రాట్స్ ఫర్ యువర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ అని మొదట డైరెక్టర్ చందూ మొండేటి నుంచి మెసేజ్ వచ్చిందని, ఆ తర్వాత కాల్స్, మెసేజ్‌లు వరుసపెట్టి వచ్చాయని చెప్పింది. ఈ విజయం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొంది నిధి.

మరోవైపు 'ఇస్మార్ట్ శంకర్' మూవీ ఊహించిన దానికి మించి రెస్పాన్ తెచ్చుకుంటోంది. పూరి జగన్నాథ్ టేకింగ్ మాస్ ఆడియన్స్ లో ఉత్సాహం నింపుతోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎనర్జీ లెవల్స్, అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ గ్లామర్ డోస్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. రామ్, నిధి, నభా ముగ్గురి కెరీర్ ఈ సినిమాతో టర్న్ అయినట్లే అనేది విశ్లేషకుల మాట.


Click it and Unblock the Notifications











