గోవాలో పూరి, ఛార్మిలతో నిధి సరదాలు.. దిమాక్ ఖరాబ్ చేస్తూ ఎంజాయ్
ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో యువత దిమాక్ ఖరాబ్ చేసింది నిధి అగర్వాల్. ఆమె అందాలపై ఫోకస్ పెట్టి కుర్రకారుకు కిక్కిచ్చారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమా సమయంలోనే పూరి జగన్నాథ్, ఛార్మిలతో ఫుల్లుగా క్లోజ్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే గోవాలో పూరి, ఛార్మిలతో కలిసి సరదా చేసింది నిధి అగర్వాల్. ఆ వివరాలు చూద్దామా..

గోవాలో రొమాంటిక్..
ప్రస్తుతం పూరిజగన్నాథ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ నిమిత్తం గోవా వెళ్లారు పూరి, ఛార్మి. అయితే వారిని కలిసేందుకు గోవా వెళ్లిన నిధి అగర్వాల్ అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసింది.

వాళ్ళతో సగం రోజు గడిపా..
ఈ మేరకు పూరి, ఛార్మిలతో కలిసి దిగిన పిక్ షేర్ చేసిన నిధి అగర్వాల్.. ''నా ఫెవరెట్స్ పూరి జగన్నాథ్, ఛార్మిలతో కలిసి సగం రోజు గడిపా. చాలా సంతోషంగా ఉంది'' అని పేర్కొంది. ఆమె షేర్ చేసిన ఈ పిక్ లో నిధి అందాలు దిమాక్ ఖరాబ్ చేసేలా ఉండటంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అయింది.
పూరి తనయుడు హీరో
తన కొడుకు ఆకాష్ పూరీని ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కించి స్టార్ హీరోని చేయాలని తాపత్రయ పడుతున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ మేరకు తన స్వీయ దర్శకత్వంలో కొడుకు హీరోగా పెట్టి 'మెహబూబా' సినిమా రూపొందించారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో మరో దర్శకుడికి తన కొడుకు బాధ్యతను అప్పజెప్పి నిర్మాతగా రొమాంటిక్ సినిమా తీస్తున్నాడు.
Recommended Video

రొమాంటిక్ డోస్ మరింత ఉంటుందని..
అనిల్ పాదూరి దర్శకత్వంలో 'రొమాంటిక్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఆకాష్ పూరి హీరోగా నటిస్తుండగా అందాల భామ కేతికశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే పేరుకు తగ్గట్టే ఈ సినిమాలో రొమాంటిక్ డోస్ మరింత ఉంటుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ద్వారా తెలిసింది. పూర్తి స్థాయిలో యూత్‌ను టార్గెట్ చూస్తూ పూరీ తరహా ప్రేమ కథా చిత్రంగా రొమాంటిక్ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఇటీవలే వచ్చిన హీరోయిన్ కేతికశర్మ టాప్ లెస్ పోజ్ బాగా అట్రాక్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











