ఇస్మార్ట్ శంకర్: రామ్ సరసన హీరోయిన్‌ను ఫైనల్ చేసిన పూరి జగన్నాధ్
ఎనర్జిటిక్ హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో రాబోతున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి హీరోయిన్ ఖరారైంది. 'మిస్టర్ మజ్ను' ఫేం నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినట్లు నిర్మాత చార్మీ కౌర్ అఫీషియల్‌గా ప్రకటించారు. సవ్యసాచి, మిస్టర్ మజ్ను తర్వాత... నిధి అగర్వాల్ తెలుగులో చేస్తున్న మూడో సినిమా ఇది.
షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. .'డబుల్ ధమాకా దిమాక్ ' అనే క్యాప్షన్ తో సినిమా వస్తుండగా సరికొత్త హెయిర్ స్టైల్, గడ్డంతో రామ్ ఈ సినిమాలో కనిపించనున్నారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా, రాజ్ తోట సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు.
పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సమర్పణ: లావణ్య, ఆర్ట్ డైరెక్టర్ : జానీ షైక్, ఎడిటర్ : జునైద్ సిద్ధిఖి, పాటల రచయిత: భాస్కరభట్ల, ఫైట్స్ : రియల్ సతీష్.


Click it and Unblock the Notifications











