ఆలోచనలో పడిన నిధి.. మీరే పెట్టేయండి అంటూ వైరల్ పోస్ట్! ఇస్మార్ట్ పోరి భలే హింటిచ్చిందిగా!
నేటి రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. సాధారణ జనం మొదలుకొని సెలెబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా నేటి తరం హీరోయిన్లకు ఇదే ప్రధాన ఆదారంగా మారింది. తమను తాము ప్రమోట్ చేసుకోవడం కోసం ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకుంటున్నారు అందాల తారలు. ఈ నేపథ్యంలోనే ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సరికొత్త ప్రయోగం చేసింది. వివరాల్లోకి పోతే..

నిధి అగర్వాల్ జోష్.. సోషల్ మీడియా హంగామా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తుండటం నిధి అగర్వాల్ స్టైల్. తన సినిమాల సంగతి ఎలా ఉన్నా.. అందాలతో తన అభిమానులను కనువిందు చేయడంలో ఏ మాత్రం వెనకడుగేయదు నిధి. నిత్యం ఆన్‌లైన్ హంగామా చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.

ఫ్రెష్ పోస్ట్.. ఛాయిస్ మీదే అంటూ ఆఫర్
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసిన నిధి ఛాయిస్ మీదే అంటూ ఆఫర్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఏదో ఆలోచిస్తునట్లుగా ఉన్న తన అందమైన లుక్ పోస్ట్ చేస్తూ.. 'మీరే కాప్షన్ పెట్టేయండి' అని తనదైన కామెంట్ విసిరింది నిధి అగర్వాల్. దీంతో ఒక్కసారిగా ఈమె గురించి ఆలోచించే పనిలో పడ్డారు నెటిజన్లు.

నెక్స్ట్ ఏంటి? నిధి ఆలోచనలో పడింది
ఇస్మార్ట్ శంకర్ సినిమా రూపంలో భారీ బ్లాక్ బస్టర్ కొట్టేశాను. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? నిధి ఆలోచనలో పడిందంటూ ఈ పిక్‌పై కామెంట్లు వస్తున్నాయి. సో క్యూట్ అని కొందరు.. తర్వాతి సినిమాకు ఎంత తీసుకోవాలని ఆలోచిస్తుందని ఇంకొందరు ఇలా రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఇస్మార్ట్ పోరి మనసులో మాట.. చాలా మందే ఉన్నారంటూ షాక్
ఇక ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనకు రాముడి లాంటి వ్యక్తిని భర్తగా పొందాలనుందని మనసులో మాటను బయటపెట్టింది నిధి అగర్వాల్. తన జీవితంలో కృష్ణుడి లాంటి వాళ్లు చాలా మందే ఉన్నారని చెప్పి మరో షాక్ కూడా ఇచ్చింది. ఇక తనకు ఫ్లవర్స్, ఖరీదైన డిన్నర్ వద్దన్న నిధి.. ఇంటి వద్ద పిజ్జాలు తినకుంటూ సినిమా చూడలని.. ఇదే తన డ్రీమ్ డేట్ అని చెప్పింది.

రామ్‌తో రొమాన్స్.. దిమాక్ ఖరాబ్
ఇక నిధి అగర్వాల్ సినిమాల విషయానికొస్తే.. తెలుగులో వరుసగా అక్కినేని అన్నదమ్ములతో రొమాన్స్ చేసి వావ్ అనిపించింది. అక్కినేని నాగ చైతన్యతో 'సవ్యసాచి'లో, అలాగే అక్కినేని అఖిల్‌తో 'మిస్టర్ మజ్ను' సినిమాలు చేసింది నిధి అగర్వాల్. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ సరసన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో రొమాన్స్ చేసి కుర్రకారు దిమాక్ ఖరాబ్ చేసింది.

ప్రస్తుతం నిధి సినీ ప్రయాణం
ఇకపోతే ఈ భామ ప్రస్తుతం హిందీలో ఓ సినిమా చేస్తున్నట్లుగా సమాచారం. అలాగే తమిళ్‌లో జయం రవి సరసన భూమి అనే సినిమాలో నటిస్తోంది నిధి అగర్వాల్. ఏదేమైనా అమ్మడికి అందంతో పాటు టాలెంట్ కూడా ఎక్కువెలెండి!.


Click it and Unblock the Notifications











