ముంబైలో ఎవరికైనా అవి కావాలా? అనేసిన నిధి అగర్వాల్.. ఆమె ఆలోచన అదేనా?

Recommended Video

Nidhhi Agerwal Tweets On Mumbai Rains || Filmibeat Telugu

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇస్మార్ట్‌గా ఓ ట్వీట్ చేసింది. సాధారణంగానే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ నెటిజన్లకు అందాల విందులిచ్చే నిధి అగర్వాల్.. ప్రస్తుతం ముంబై నగరాన్ని ముంచెత్తుతున్న వర్షాల విషయమై కాస్త వెరైటీగా స్పందించింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆమె తన లేటెస్ట్ లుక్ పోస్ట్ చేస్తూ ముంబై అవసరాల గురించి ప్రస్తావించింది. ఇంతకీ ఆమె ఏమంది? అందులో అర్థమేంటి? వివరాల్లోకి పోతే..

ముంబై నగరాన్ని ముంచెత్తుతున్న వర్షాలు

ముంబై నగరాన్ని ముంచెత్తుతున్న వర్షాలు

ముంబై మహా నగరం మరోసారి భారీ వర్షాలతో జలమయమైంది. గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవన స్రవంతి స్తంభించిపోయింది. భారీ వర్షం కారణంగా, రోడ్లు సరిగ్గా కనిపించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా ఇంట్లో నుంచి బయటకురాని పరిస్థితి నెలకొంది.

బొంబాయిలో ఎవరికైనా ఇవి కావాలా? అంటూ నిధి

బొంబాయిలో ఎవరికైనా ఇవి కావాలా? అంటూ నిధి

ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. బొంబాయిలో ఎవరికైనా అంబరిల్లా గానీ పైనాపిల్ గానీ కావాలా? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది. ఈ మేరకు హాట్ హాట్ గా తన సెక్సీ లుక్ పోస్ట్ చేసింది. నిజంగానే ఈ సమయంలో అవసరమయ్యే వాటినే కావాలా? అని నిధి ప్రశ్నించడంతో మాకంటే మాకు కావాలని పోటీ పడుతూ రెస్పాన్స్ ఇస్తున్నారు నెటిజన్లు.

ఆ రకమైన ఆలోచన ఆమెలో ఉన్నట్లే

ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో నిధి అగర్వాల్ ఇలా ట్వీట్ చేసిందంటే.. అక్కడి ప్రజలకు ఏదో ఒక సహాయం చేయాలనే ఆలోచన ఆమెలో ఉన్నట్లే అని తెలుస్తోంది. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ విజయం జోష్‌లో ఉంది కాబట్టి ఇలా సోషల్ వర్క్ పై దృష్టి పెడుతుందేమో మరి. మొత్తానికైతే నిధి ఇచ్చిన ఆఫర్ ని చాలామందే స్వీకరించారు. ఇక ఆమె నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

ఇస్మార్ట్ దిమాక్ ఖరాబ్

ఇస్మార్ట్ దిమాక్ ఖరాబ్

ఇటీవలే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన అందచందాలతో దిమాక్ ఖరాబ్ చేసింది నిధి అగర్వాల్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన ఆమె వేసిన చిందులు, చూపిన అభినయం, అందాల విందు ప్రేక్షకలోకాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా అందించిన విజయం నిధి అగర్వాల్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.

పూరి, ఛార్మిలతో కలిసి షికార్లు

పూరి, ఛార్మిలతో కలిసి షికార్లు

ఇక ఇస్మార్ట్ శంకర్ విజయాన్ని పూరి జగన్నాథ్, ఛార్మిలతో కలిసి నిధి అగర్వాల్ తెగ ఎంజాయ్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి అభిమానులకు అందాల విందు ఇస్తూ పూరి, ఛార్మిలతో కలిసి విజయోత్సవ యాత్ర చేసింది నిధి. మరోవైపు బిగ్ బాస్ వేదికపై కూడా నాగార్జున, రామ్ లతో కలిసి జోష్ చూపించింది నిధి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X