ఆ కోరిక ఇప్పటిది కాదు.. చాలా నాటీగా, బోల్డ్‌గా.. నిధి అగర్వాల్
నిధి అగర్వాల్.. ఈ మధ్యకాలంలో కుర్రకారులో హీటు పుట్టిస్తున్న అందాల తార. ''సవ్యసాచి, మిస్టర్ మజ్ను'' అనే రెండే రెండు సినిమాలు చేసినప్పటికీ తన హాట్‌నెస్ తో యూత్ ఆడియన్స్‌ని బుట్టలో వేసుకుంది. ఇక ఈమె చేస్తున్న మూడో ప్రాజెక్టు 'ఇస్మార్ట్ శంకర్' ఈ సినిమాలో రామ్ సరసన నటిస్తున్న ఆమె రెచ్చిపోయి గ్లామర్ షో చేసేసింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ చూస్తుంటే నిధి అగర్వాల్ ఏ రేంజ్‌లో అందాలు ఆరబోసిందో అర్థమవుతోంది. పైగా ఇది పుర జగన్నాథ్ సినిమా కావడంతో ఆమె అందాలకు మరింత పదును పెట్టారాయన.
జులై 18 వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న సందర్బంగా చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది నిధి అగర్వాల్. తనకు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందని చెప్పిన ఆమె..ఇస్మార్ట్ శంకర్ సినిమాలో భాగం కావడం తన అదృష్టమని పేర్కొంది. ఈ సినిమాలో తాను సైంటిస్ట్ 'సారా' అనే పాత్ర పోషించానని, ఈ పాత్ర తాను చాలా నాటీగా, బోల్డ్‌గా కనిపిస్తానని ఓపెన్ గా చెప్పేసింది నిధి అగర్వాల్. తన పాత్ర గ్లామర్ తో పాటు ఎమోషన్ అంశాలను కలగలిపి ఉంటుందని, ఈ పాత్రను పూరి ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దారని చెప్పింది నిధి అగర్వాల్.

పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందింది 'ఇస్మార్ట్ శంకర్' మూవీ. పూరి జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. నిధి అగర్వాల్, నభా నటేష్ ఆయనతో చిందులేశారు. జులై 18 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











