కొంటె పిల్లను.. ఆ కోరిక ఉండేది.. మా పక్కింట్లో ఉండే ఆయన.. నిధి అగర్వాల్

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అందాలతో మాయ చేసి టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారింది నిధి అగర్వాల్. గతంలో సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సక్సెస్ జోష్‌లో మునిగి తేలుతున్న నిధి తాజాగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. ఆ వివరాలు చూద్దామా..

కొంటె పిల్లను.. ఆవేశం ఎక్కువ

కొంటె పిల్లను.. ఆవేశం ఎక్కువ

ఇంటర్వ్యూలో భాగంగా తన చిన్నప్పటి విశేషాలకు పంచుకుంది నిధి అగర్వాల్. తాను బాల్యంలో కొంటె పిల్లను అని, అప్పుడు తనలో ఆవేశం ఎక్కువగా ఉండేదని చెప్పింది. అబ్బాయిలను, అమ్మాయిలను బాగా కొట్టేదాన్నని, క్లాస్ లకు బంక్ కొడుతూ కొంటె పనులు ఎక్కువగా చేసేదాన్నని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.

నాలుగో తరగతిలో ప్రేమ.. ఇబ్బందిగా ఉండేది

నాలుగో తరగతిలో ప్రేమ.. ఇబ్బందిగా ఉండేది

తాను నాలుగో తరగతిలో ఉన్నప్పుడే ఒక అబ్బాయిని ఇష్టపడ్డానని, అదే తన తొలి క్రష్ అని చెప్పింది నిధి. అయితే ఇప్పుడు ఆ అబ్బాయి తనకు మంచి స్నేహితుడయ్యాడని ఆమె తెలిపింది. తాను కాలేజీలో కూడా కొంటె పనులే ఎక్కువగా చేసేదాన్ని అని తెలిపింది. తనకు డ్రెస్ కోడ్ చాలా ఇబ్బంది కలిగించేదని, కానీ వేసుకోక తప్పక పోయేదని ఆమె చెప్పింది.

ఆ కోరిక బలంగా ఉండేది.. పక్కింట్లో ఆయన

ఆ కోరిక బలంగా ఉండేది.. పక్కింట్లో ఆయన

తనకు యాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేదని, కానీ తమది సినిమా ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ కాకపోవడంతో మెల్లగా మోడలింగ్ రంగంలో ఎంటర్ అయ్యానని తెలిపింది. తమ పక్కింట్లో ఓ పెద్ద ఫోటో గ్రాఫర్ ఉండేవారని, ఆయన దగ్గరకు ఐశ్వర్య రాయ్, లారా దత్త లాంటి బిగ్ స్టార్స్ వచ్చి ఫోటోలు తీయించుకునే వారని.. అయితే ఆ సమయంలో తాను రహస్యంగా వాళ్ళింటికి వెళ్లి ఆ ఫోటో షూట్స్ చూసేదాన్నని తెలిపింది.

టాలీవుడ్ ఆడియన్స్ రిసీవింగ్ సూపర్

టాలీవుడ్ ఆడియన్స్ రిసీవింగ్ సూపర్

తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని, టాలీవుడ్‌లో అందరూ సపోర్ట్ చేస్తుంటారని చెప్పింది నిధి అగర్వాల్. అయితే తెలుగు భాష కొంచెం కష్టమైన పనే అని, దానికంటే యాక్టింగ్ చేయడం ఈజీ అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. ఇక్కడి సినిమాల్లో ఇంకా రాణించాలని ఉందని ఆమె పేర్కొంది.

ఇస్మార్ట్ దిమాక్ ఖరాబ్

ఇస్మార్ట్ దిమాక్ ఖరాబ్

ఇటీవలే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన అందచందాలతో దిమాక్ ఖరాబ్ చేసింది నిధి అగర్వాల్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన ఆమె వేసిన చిందులు, చూపిన అభినయం, అందాల విందు ప్రేక్షకలోకాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా అందించిన విజయం నిధి అగర్వాల్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X