ఇది పగనా లేక ఎక్స్‌పోజింగా లేదంటే ఎక్సర్‌సైజా?తికమక పెడుతున్న నిధి అగర్వాల్..ఏం మెసేజ్ ఇస్తున్నట్లు.
యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్‌గా ఉంటోంది. ఓ పక్కన సినిమాలు చేస్తూనే మరోపక్క తనకు సంబందించిన అన్ని విషయాలను ఆన్ లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌పై షేర్ చేస్తూ యూత్ ఆడియన్స్‌ని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తన ట్విట్టర్ ద్వారా ఆమె షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను తికమక పెట్టేస్తోంది.

ఈ వీడియోలో.. మిడ్డీ వేసుకొని తొడలు కనిపించేలా ఓ మనిషిలాంటి బొమ్మపై కూర్చొని యమ స్పీడ్ గా ఆ బొమ్మ ముఖం పగలగొట్టేస్తోంది నిధి అగర్వాల్. చేతికి పెట్టుకున్న గ్లౌజులతో బొమ్మ ముఖం పచ్చడి చేస్తూ ఎంతో కసిగా కనిపించింది నిధి. అంతేకాదు ఈ వీడియోలో నిధి నడుము అందాలు కూడా కవ్విస్తున్నాయి. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇంతకీ నిధి అగర్వాల్ ఎవరి పైనైనా పగ తీర్చుకుంటోందా? లేక ఈ రకంగా ఎక్స్‌పోజింగ్ చేస్తోందా? లేదంటే తన శరీరాకృతిని మెరుగు పరుచుకునేలా ఎక్సర్‌సైజ్ చేస్తుందా? అనేది తెలియక తల పట్టుకుంటున్నారు. ఈ మేరకు ఈ వీడియోపై తెగ కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. ఓ డిఫెరెంట్ స్టైల్‌లో సోషల్ మీడియా వేదికగా తనను తాను ప్రమోట్ చేసుకుంది నిధి అగర్వాల్. అందాలు ఆరబోయడమే కాదు ఇలా కూడా సెన్సేషన్ కావచ్చు అని ఓ కొత్త సోషల్ మీడియా టెక్నిక్ చెప్పింది హైదరాబాదీ భామ నిధి అగర్వాల్. ఇక నిధి సినిమాలంటారా..? ఇటీవలే అక్కినేని అఖిల్ సరసన మిస్టర్ మజ్ను చిత్రంలో ఆడిపాడిన ఈ యంగ్ లేడీ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన నటిస్తోంది. ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్త సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా జులై నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











