పవన్ కళ్యాణ్‌తో పొలిటికల్ సినిమా? ఆ రూమర్లపై దేవా కట్టా క్లారిటీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీతో మరోసారి తన మాస్ ఇమేజ్‌ను ప్రూవ్ చేసుకున్నారు.ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్ వర్గాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆయన 33వ సినిమా గురించి రోజుకో వార్త వెలువడుతూ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో దర్శకుడు దేవా కట్టా పేరు కూడా బలంగా వినిపించడంతో, ఇద్దరి కాంబినేషన్‌లో పవర్‌ఫుల్ పొలిటికల్ సినిమా రాబోతుందనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఊహాగానాలపై తాజాగా దేవా కట్టా స్వయంగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారు?

Hema: స్టార్ హీరో కొడుకుతో కూతురి పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి హేమ...

ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విడుదల తరువాత నుంచి పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్ పై మొదట పవన్ కళ్యాణ్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలాంటి కొత్త సినిమా కమిట్‌మెంట్లు తీసుకోలేదని, బయట వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. ఆయన ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో పాటు ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తి చేసే దశలో ఉన్నారని వెల్లడించారు. కొత్త సినిమాలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

No Political Film with Pawan Kalyan Deva Katta Breaks Silence on Viral Buzz

ఇటీవల హరీష్ శంకర్, మోహన్ రాజా, దేవా కట్టా వంటి దర్శకులతో పవన్ సినిమాలు ఫిక్స్ అయ్యాయని వచ్చిన వార్తలు కూడా ఇదే నేపథ్యంలో ఖండించబడ్డాయి. ముఖ్యంగా మోహన్ రాజా కథ చెప్పారనే ప్రచారం, దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ డ్రామా తెరకెక్కుతుందనే వార్త కూడా కేవలం ఊహాగానమేనని తేలిపోయింది. ఇదిలా ఉంటే OG 2 (ఓజీ సీక్వెల్) గురించి కూడా సోషల్ మీడియాలో విస్తృత చర్చ సాగుతోంది. దీనిపై కూడా పవన్ టీమ్ స్పందిస్తూ, సరైన సమయం వచ్చినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని తెలిపింది. అప్పటివరకు వస్తున్న రూమర్లను నమ్మవద్దని సూచించింది. దీంతో OG 2పై ఆసక్తి మరింత పెరిగింది.

ఈ తరుణంలో దేవా కట్టా తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్‌తో ప్రస్తుతం ఎలాంటి పొలిటికల్ సినిమా ప్రాజెక్ట్ లేదని ఖండించారు. 'ఈ రూమర్ ఎవరు మొదలుపెట్టారో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడం నా కల. 'రిపబ్లిక్' సినిమా ఆలోచన కూడా ఆయన కోసమే వచ్చింది. మా ఇద్దరికి నచ్చిన కథ దొరికితే అది తప్పకుండా జరుగుతుంది. అయితే ప్రస్తుతం నేను ఒక నాన్-పొలిటికల్ స్క్రిప్ట్‌పై పని చేస్తున్నాను. రాజకీయ సినిమాల గురించి ఇప్పుడు ఆలోచన లేదు'అని ఆయన స్పష్టం చేశారు.

ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయబోతున్నారనే విషయం ముందుగానే వెలుగులోకి వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. తాజా ప్రకటనతో ఆ సినిమా కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా మొత్తంగా చూస్తే.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై వస్తున్న వార్తలు ప్రస్తుతం పూర్తిగా రూమర్లే అన్నది క్లియర్ అయింది. ఆయన దృష్టి ప్రస్తుతం రాజకీయ బాధ్యతలు,ఇప్పటికే ఉన్న సినిమాలపైనే ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది. అయితే అభిమానులు మాత్రం కొత్త సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ నుంచి తదుపరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X