పీకల్లోతు అప్పుల్లో పవన్ కల్యాణ్.. ఎవరెవరి నుంచి ఎంత అప్పు అంటే.. వదిన నుంచి ఎన్ని కోట్లంటే?
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఘట్టాన్ని ముగించుకొన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన శాసన సభలో ఎమ్మెల్యే పదవికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తుల కంటే అప్పులు అందర్నీ ఎక్కువగా ఆకర్షించాయి. పవన్ కల్యాణ్ ఎంత అప్పు ఉంది? ఎవరెవరి వద్ద ఎంత అప్పు తీసుకొన్నారనే విషయాన్ని ఆయన అఫిడవిట్‌లో స్పష్టంగా వెల్లడించారు. ఆయన అప్పుల వివరాల్లోకి వెళితే..
పవన్ కల్యాణ్ నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం మొత్తం పర్వదినం లాంటి వాతావరణం కనిపించింది. వాస్తవంగా హనుమాన్ జయంతి కూడా కావడంతో రెండింతలు పండగ వాతావరణం అన్ని చోట్ల కనిపించింది. ఉదయం నుంచి అభిమానులు భారీగా తరలి వచ్చారు. దిచక్ర వాహనాలు, కార్ల ర్యాలీగా తరలివచ్చారు.
ఇండస్ట్రీలో చాలా లైఫ్ చూశా.. సైలెంట్‌గా ఉండలేను.. నయనతార, కుష్బూను లాగిన కస్తూరి శంకర్

తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రాగా.. జనసేనాని ఓపెన్ టాప్ వాహనంలో కదిలి వెళ్లారు. రోడ్డు పొడుగున జనసైనికులు, ప్రజలు, ఓటర్లు, ఫ్యాన్స్ నీరాజనం పట్టారు. అభిమానుల ఉత్సాహం ఉరకలెస్తుండగా ఆయన నామినేషన్ పత్రాలను అధికారికి అందించారు. ఆయన వెంట పిఠాపురం ఇంఛార్జి వర్మ, నాగబాబు తదితరులు ఉన్నారు.
ఇక ఎన్నికల సంఘానికి పవన్ కల్యాణ్ సమర్పించిన అఫిడవిట్‌లో 46.7 కోట్ల అప్పు ఉన్నట్టు చూపించారు. ఎవరెవరి వద్ద ఎంత అప్పు తీసుకొన్నాననే వివరాలను ఆయన స్పష్టంగా వెల్లడించారు. అత్యధికంగా ఆయన 8 కోట్ల రూపాయలు విజయలక్ష్మీ వీఆర్ అనే మహిళ వద్ద తీసుకొన్నారు.
ఇక పవర్ స్టార్ అప్పులు చూపించిన వాటిలో హారిక, హాసిని నుంచి 6.35 కోట్లు, లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 6 కోట్ల రూపాయలు, ఎంవీఆర్ఎస్ ప్రసాద్ నుంచి 3.5 కోట్ల రూపాయలు, నిర్మాత ఎర్నేని నవీన్ నుంచి 5.5 కోట్ల రూపాయలు, ఎం ప్రవీణ్ కుమార్ నుంచి 3 కోట్ల రూపాయలు, మైత్రీ మూవీ మేకర్స్ నుంచి 3 కోట్ల రూపాయలు, శ్రీ యశ్వంత్ ఫైనాన్సియర్ నుంచి 3 కోట్ల రూపాయలు, రాహుల్ కుందవరం నుంచి 2.8 కోట్లు, ఎంవీఆర్ఎస్ ప్రసాద్ 2 కోట్లు తీసుకొన్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి సతీమణి, తన వదిన నుంచి కొణిదెల సురేఖ నుంచి 2 కోట్ల రూపాయలు, కోటిమిరెడ్డి సాహిత్య రెడ్డి నుంచి 50 లక్షలు, లింగారెడ్డి లలితా 50 లక్షలు, ఏ దయాకర్ నుంచి 45 లక్షలు, డీవీవీ దానయ్య నుంచి 10 లక్షలు రూపాయలు తీసుకొన్నట్టు అఫిడవిట్‌లో చూపించారు. ఇవన్నీ వ్యక్తిగతమైన లోన్లు అని చూపించారు.


Click it and Unblock the Notifications











