పెద్ది రిలీజ్ డేట్‌ పై గందరగోళం.. ‘నన్ను క్షమించండి' అన్న స్టార్ ప్రొడ్యూసర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ పెద్ది( Peddi). రామ్ చరణ్ హీరోగా వస్తోన్న పెద్ది మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక చెర్రీ బర్త్‌ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయగా.. అందులోని రెజ్లర్‌ లుక్‌లో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమా విడుదల తేదీపై సోషల్ మీడియాలో భారీ గందరగోళం నెలకొంది. ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 30న కాకుండా, సినిమా వాయిదా పడుతుందనే వార్తలు వైరల్ కావడంతో మెగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

ముఖ్యంగా నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన కామెంట్స్ ఈ చర్చను మరింత వేడెక్కించాయి. ఇటీవల చెన్నై లవ్ స్టోరీ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఎస్‌కేఎన్.. డైరెక్టర్ సాయి రాజేష్ ద్వారా తెలుసుకున్న సమాచారం ఆధారంగా పెద్ది సినిమా జూన్ 26న విడుదల కావచ్చని చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అదే తేదీకి తమ సినిమాను కూడా రిలీజ్ చేయాలని అనుకున్నామని, కానీ రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమా వస్తుండటంతో క్లాష్ తప్పించుకోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.

Peddi Release Date Confusion Producer SKN Apologizes No Official Postponement Yet

దీంతో పెద్ది వాయిదా ఖాయం అనే టాక్ వేగంగా వైరల్ అయింది. ఈ వ్యాఖ్యలను నెటిజన్లు, ఫ్యాన్స్ పెద్ది సినిమా కొత్త అధికారిక రిలీజ్ డేట్‌గా భావించడంతో, సోషల్ మీడియాలో జూన్ 25/26 తేదీలపై పోస్టులు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇలా మెగా అభిమానుల్లోనే కాకుండా సినీ ప్రేమికులు కూడా కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఎస్‌కేఎన్ వెంటనే స్పందించి వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. తన తప్పును తెలుసుకుని క్షమాపణ కూడా చెప్పారు.

ఓ వీడియోలో ఎస్కేఎన్ మాట్లాడుతూ 'సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్స్ చూసి పెద్ది పోస్ట్‌పోన్ అధికారికంగా ప్రకటించారని అనుకున్నాను. చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో అదే గందరగోళంలో నేను జూన్ 26 అని చెప్పాను. కానీ అది అధికారిక సమాచారం కాదు' అని వెల్లడించారు.
అదే సమయంలో, 'ఒక పెద్ద సినిమా రిలీజ్ విషయంపై సరైన క్లారిటీ లేకుండా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. పెద్ది సినిమా యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక విడుదల తేదీ ప్రకటించలేదు. నేను చెప్పింది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే, దాన్ని రిలీజ్ డేట్‌గా తీసుకోకండి' అంటూ ఎస్‌కేఎన్ క్లారిటీ ఇచ్చారు.

ఈ క్షమాపణలతో పెద్ది విడుదల తేదీపై కాస్త గందరగోళం తగ్గినప్పటికీ, పెద్ది అధికారిక ప్రకటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సినిమా విడుదలపై త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తయితే, ముందుగా అనుకున్న ఏప్రిల్ 30నే థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Dhurandhar 2 Day 12 Collections: ''ధురంధర్ 2' కలెక్షన్స్ సునామీ .. రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
ఇక సినిమా విషయానికి వస్తే, దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. చెర్రీ బర్త్‌డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌లో రెజ్లర్‌గా ఆయన లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఒక చిన్న మిస్ కమ్యూనికేషన్ పెద్ద చర్చకు దారితీయగా, చివరకు నిర్మాత ఎస్‌కేఎన్ 'సారీ' చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మెగా అభిమానులంతా ఎదురు చూస్తున్నది ఒక్కటే..'పెద్ది' అసలు రిలీజ్ డేట్‌పై అధికారిక క్లారిటీ. రామ్ చరణ్ మూవీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది వేచి చూడాలి.

Read more about: peddi ram charan producer skn
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X