వాళ్లకు అమ్మాయిలను వేధించడం అలవాటు.. జల్సా మూవీ వివాదంపై పూనమ్ కౌర్ మరో ట్వీట్

ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో చక్కని పేరును తెచ్చుకున్న నటీమణి పూనమ్ కౌర్. లోకల్ బ్యూటీనే అయినా ఆరంభంలోనే చాలా చిత్రాల్లో నటించిన ఈ భామ.. ఆ తర్వాత అంతగా ఆఫర్లను అందుకోలేకపోయింది. దీంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటిఫుల్ లేడీ తరచూ వివాదాస్పద పోస్టులు చేస్తూ సెన్సేషన్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పూనమ్ కౌర్.. ఆంధ్రప్రదేశ్‌లో గీతాంజలి అనే మహిళ మరణంపై స్పందిస్తూ 'జల్సా' వివాదాన్ని గుర్తు చేసింది. ఆ వివరాలను మీరే చూడండి!

సంచలనంగా గీతాంజలి మృతి
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ గీతాంజలి అనే మహిళ మృతి సంచలనంగా మారిపోయింది. కొద్ది రోజుల క్రితమే ఆమె వైఎస్ జగన్ ప్రభుత్వంలో తనకు ఎన్నో పథకాలు వచ్చాయని, చాలా మేలు జరిగిందని చెబుతూ వీడియో చేసింది. అది వైరల్ అయిన కొద్ది రోజులకే ఆమె కన్నుమూసింది. దీంతో ఈ ఘటన రాజకీయ రంగును పులుముకుంది.

Poonam Kaur Sensational Tweet On Geetanjali death and Reminds Jalsa Controversy

ట్రోలింగ్ వల్లే అంటూ క్లారిటీగా
జగన్ ప్రభుత్వంలో తనకు ఎంతో మేలు జరిగిందని గీతాంజలి చేసిన వీడియోపై చాలా రకాల ట్రోల్స్ వచ్చాయి. దీనివల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీల వాళ్లు కొట్టిపారేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు తమ ప్రాథమిక విచారణలో గీతాంజలి ట్రోలింగ్ వల్లే ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు.

న్యాయం చేయాలన్న పూనమ్
గీతాంజలి మరణం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దీంతో ఈ వ్యవహారంపై చాలా మంది స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తమ స్వరాన్ని వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా గీతాంజలి మరణంపై రెస్పాండ్ అయింది. ఈ మేరకు ఆమెకు న్యాయం చేయాలని, దీనికి కారకులైన వారిని శిక్షించాలని X (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది.

వాళ్లకు వేధించడం అలవాటే
గీతాంజలి మృతిపై పూనమ్ స్పందిస్తూ.. 'గీతాంజలికి న్యాయం జరగాలి.. అసలు ఆమె విషయంలో ఏం జరిగింది? ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఆన్‌లైన్ ట్రోల్స్ కారణమా? ఏదైనా ఒక రాజకీయ పార్టీదా? అసలే వాళ్లకిలా అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం అలవాటు. దయచేసి వాళ్లను శిక్షించండి. ఆమె పిల్లలకు న్యాయం చేయండి' అని పేర్కొంది.

జల్సా రూమర్లు తీసుకొచ్చారు
గీతాంజలి మరణంతో తనకు గతంలో జరిగిన ట్రోలింగ్‌ను ముడిపెడుతూ పూనమ్ కౌర్ మరో ట్వీట్ చేసింది. అందులో 'నాకు వ్యతిరేకంగా ఆ 'జల్సా' మూవీ రూమర్లను తెరపైకి తీసుకొచ్చారు. నిజాన్ని కప్పి పుచ్చేందుకు.. అసలు నిజాన్ని ఎవ్వరూ నమ్మకుండా ఉండేందుకు అలా రూమర్లను నాపై క్రియేట్ చేశారు' అంటూ ఈ హీరోయిన్ చెప్పుకొచ్చింది.

స్టార్ హీరోయిన్‌ను వేలం వేసిన భర్త.. తన స్నేహితులతో శృంగారం చేయాలంటూ!

నేను ఎవరినీ అడుక్కోలేదని
అదే ట్వీట్‌లో హీరోయిన్ పూనమ్ కౌర్ 'నా కెరీర్‌లో నేను ఎప్పుడూ కూడా ఏ డైరెక్టర్‌ను కానీ, ఏ హీరోను కానీ అవకాశం ఇవ్వమని అడుక్కోలేదు. వచ్చింది చేసుకుంటూ పోయాను. నేను చేసిన సినిమాల కంటే వదిలేసిన సినిమాలే ఎక్కువ. దయచేసి ఆ రూమర్లను నమ్మకండి' అని చెప్పింది. తద్వారా మరోసారి తెలుగు రాష్ట్రాల్లో పూనమ్ కౌర్ సెన్సేషన్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X