Liger మూవీకి ప్రభాస్ చేయూత.. ట్రైలర్ రిలీజ్ కోసం అదిరిపోయే రోడ్ మ్యాప్!
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ సినిమా రోజు రోజుకు అంచనాలను పెంచుతున్నది. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించేందుకు ముంబై నుంచి టోటల్ యూనిట్ హైదరాబాద్‌కు చేరుకొన్నది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న లైగర్ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకను హైదరాబాద్‌లోని సినీ రాజధాని ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోని సుదర్శన్ 35ఎంఎం థియేటర్లలో ఆవిష్కరించనున్నారు. అయితే ఈ సినిమాకు ప్రభాస్ చేయూతనిచ్చేందుకు సిద్దమయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..
లైగర్ ట్రైలర్ రిలీజ్ వేడుకను నభూతో నభవిష్యత్ అనే విధంగా ఆవిష్కరించేందుకు రోడ్ మ్యాప్‌ను సిద్దం చేశారు.

జూలై 21వ తేదీ ఉదయం 8.30 గంటలకు ఇందిరా పార్క్ నుంచి ర్యాలీ ప్రారంభమై 9 గంటల వరకు సుదర్శన్ థియేటర్‌కు చేరుకొంటుంది.
9.15 నుంచి 9.30 గంటల వరకు సుదర్శన్ థియేటర్‌లో స్వాగత వేడుకలు అట్టహాసంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు.
10 గంటలకు థియేటర్లలో లైగర్ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శిస్తారు. ఆ తర్వాత చిత్ర యూనిట్ మీడియాను, అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
లైగర్ ట్రైలర్ రిలీజ్ కోసం రోడ్ మ్యాప్ వ్యవహారం ఆసక్తికరంగా ఉంటే.. ఈ సినిమాకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయూతనిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను, చిరంజీవి, ప్రభాస్, మలయాళం ట్రైలర్‌ను దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తారు. ఈ ట్రైలర్ వేడుకను https://www.youtube.com/c/purijagannadh యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.


Click it and Unblock the Notifications











