విజయ్ దేవరకొండ ‘లైగర్’లో అదిరిపోయే ట్విస్ట్: సినిమాలో హైలైట్ అయ్యే ఎపిసోడ్ అదే

చిన్న చిన్న పాత్రలు చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తన కెరీర్‌ను మొదలు పెట్టాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారాడు. మొదటి చిత్రంలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న అతడు.. దీని ద్వారా హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే 'అర్జున్ రెడ్డి' రూపంలో మరో భారీ సక్సెస్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ చిత్రంతో అతడు స్టార్‌గా ఎదిగిపోయాడు. అనంతరం 'గీత గోవిందం'తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ యంగ్ హీరో.. ఆ వెంటనే 'టాక్సీవాలా'తో మరో హిట్‌ను దక్కించుకున్నాడు.

ఆరంభంలో పలు విజయాలను అందుకున్న విజయ్ దేవరకొండ.. కొంత కాలంగా వరుస పరాజయాలు చవి చూస్తూ నిరాశ పరుస్తున్నాడు. ఈ మధ్య కాలంలో 'నోటా' 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దీంతో అతడి గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

Pre Climax Highlight in Vijay devarakondas Liger

బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న 'లైగర్' మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. అంతేకాదు, ఇందులో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ఎమోషనల్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రీ క్లైమాక్స్ సీన్ హైలైట్‌గా ఉంటుందట. అప్పటి వరకూ ఉంచిన సస్పెన్స్‌.. ఓ భారీ ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత రివీల్ అవుతుందని తెలుస్తోంది. ఇది సినిమా మొత్తాన్నే మలుపు తిప్పే విధంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో మూవీ అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

పాన్ ఇండియా రేంజ్ కావడంతో 'లైగర్' మూవీ షూటింగ్ ముంబై నగరంలో ప్రారంభం అయింది. అక్కడ చిత్రీకరణ జరుపుతోన్న సమయంలోనే లాక్‌డౌన్ కారణంగా పలుమార్లు ఆటంకం ఏర్పడింది. అయినప్పటికీ ఇండియాలో చేయాల్సిన షెడ్యూల్ మొత్తాన్ని కంప్లీట్ చేశారట. తాజా సమచారం ప్రకారం.. 'లైగర్' మూవీ ఫైనల్ షెడ్యూల్‌ను యూరప్‌లో ప్లాన్ చేశాడట పూరీ జగన్నాథ్. ఇందుకోసం ప్రస్తుతం లొకేషన్లను వెతికే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఒక్కసారి షూట్ ఫిక్స్ అయితే.. సింగిల్ షెడ్యూల్‌లో టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Pre Climax Highlight in Vijay devarakondas Liger

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'లైగర్' మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు చాలా రోజుల పాటు ఈ క్రీడలో శిక్షణ కూడా తీసుకున్నాడు. అలాగే, ఇందులో ఈ యంగ్ హీరో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, ఈ సినిమాను కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X