ఆ ఒక్క సినిమాతో రూ.32 కోట్లు నష్టం.. ఇండస్ట్రీ వదిలేయాలనుకున్న అశ్వినీదత్!
ప్రముఖ సినీ నిర్మాత సి. అశ్వనీదత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఐదు దశాబ్దాలలో ప్రయాణంలో టాలీవుడ్‌కు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన ఘనత ఆయనది. 1975లో వైజయంతీ మూవీస్‌ను స్థాపించిన ఆయన, ఎన్టీఆర్ హీరోగా 'ఎదురులేని మనిషి'సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్ర, మహానటి, కల్కి 2898 ఏడి వంటి సినిమాలు ఈ బ్యానర్ ఖ్యాతిని పెంచాయి. అయితే.. ఓ సినిమా వల్ల దాదాపు 32 కోట్ల రూపాయాలను నష్టపోయాల్సి వచ్చిందట. ఆ సమయంలో ఆయన ఇండస్ట్రీని విడిచివెళ్లిపోవాలని భావించారట. ఇంతకీ ఆ సినిమా ఏంటీ? అసలేం జరిగింది?
ఆ డిజాస్టర్ మూవీ ఏంటో కాదు.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'శక్తి', 2011లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ఇలియానా హీరోయిన్‌గా నటించగా, ఈసినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా కోసం అప్పట్లోనే రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఆ కాలంలో అది చాలా భారీ బడ్జెట్. ప్రపంచవ్యాప్తంగా 700కు పైగా థియేటర్లలో విడుదలైనప్పటికీ, కథా కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ఈ సినిమా గురించి నిర్మాత సి. అశ్వనీదత్ ఓ ఇంటర్వ్యూ మాట్లాడారు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పరిస్థితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయాలు, అపజయాలు సినీ పరిశ్రమలో సహజమే అయినప్పటికీ, శక్తి సినిమా తనను మానసికంగా ఎంతగా దెబ్బతీసిందో ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'శక్తి' సినిమా వల్ల తాను 32 కోట్ల రూపాయాలను నష్టపోయానని, ఆ సమయంలో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని వెల్లడించారు. ఒక దశలో సినీ పరిశ్రమను పూర్తిగా వదిలేయాలనే ఆలోచన కూడా వచ్చిందని చెప్పారు. ఈ సినిమా తర్వాత దాదాపు నాలుగేళ్ల వరకు మరో సినిమా చేయలేదని అశ్వినీ దత్ తెలిపాడు.
మరో ఇంటర్వ్యూలో తనకు హీరోల నుంచి లభించిన మద్దతును గుర్తు చేసుకున్నారు. "నేను ఏదైనా సినిమా విషయంలో నష్టపోయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి 'ఒక మంచి కథ సిద్ధం చేసుకోండి.. మనం సినిమా చేద్దాం' అని ధైర్యం చెప్పేవారు. అలాగే నాగార్జున కూడా ఎప్పుడూ అండగా నిలిచారు. నా కోసం వేరే ప్రాజెక్టులు పక్కనపెట్టి సినిమాలు చేసిన హీరోలు కూడా ఉన్నారు. అలాంటి మద్దతు వల్లే ఎన్నో కష్టాలను దాటగలిగాను" అని పేర్కొన్నారు. అయితే 'శక్తి' సినిమా విషయంలో ఎదురైన నష్టం మాత్రం తనను పూర్తిగా కుంగదీసిందని చెప్పారు.
Kalki2: ప్రభాస్ కల్కి 2 లో ఆలియా భట్? నాగ్ అశ్విన్ ఆలోచనలే వేరబ్బా!
ఇదిలా ఉంటే.. ఇప్పుడు అశ్వినీదత్ నిర్మాణం సంస్థ లెవల్ మారింది. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,040 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.650 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించగా, హిందీ వెర్షన్ ఒక్కటే రూ.280 కోట్లకు పైగా వసూలు చేసింది. ఓవర్సీర్ లో కూడా నయా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా నిర్మాత అశ్వినీదత్‌కు మరో భారీ విజయాన్ని అందించింది. ఈ సక్సెస్‌తో కల్కి 2 సీక్వెల్ కూడా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications



