నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష.. ఒంగోలు కోర్టులో చేదు అనుభవం!

సినీ నటుడు, నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. దాంతో ఈ వ్యవహారం సినీ, ప్రేక్షక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

నిర్మాత బండ్ల గణేష్‌కు ఒంగోలుకు చెందిన జెట్టి వెంకటేశ్వర్లకు ఆర్థిక సంబందమైన వివాదం కొనసాగుతున్నది. వారి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించారు. అయితే ఆ వివాదానికి పరిష్కారం లభించకపోవడంతో 95 లక్షల రూపాయల చెక్ బౌన్స్ అయిందంటూ వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. గత కొద్దికాలంగా ఈ కేసు ఒంగోలు కోర్టులో కొనసాగుతున్నది.

Bandla Ganesh-Ongole-Court

Malika Rajput Suicide: యువ నటి మృతి సూపైడ్.. ఇన్స్‌టాగ్రామ్ పోస్ట్‌లో సంచలనం!

అయితే తాజాగా కోర్టు తీర్పు కోసం బండ్ల గణేష్ ఒంగోలు న్యాయస్థానంలో హాజరయ్యారు. ఈ సిందర్భంగా రెండు వర్గాల వాదనలు పూర్తయిన తర్వాత బండ్ల గణేష్‌కు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అలాగే 30 రోజుల్లో 95 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు తీర్పులో పేర్కొన్నది. దాంతో బండ్ల గణేష్‌కు షాక్ తగిలినట్టయింది. కోర్టు తీర్పుపై 30 రోజుల్లో ఎగువ కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చని ఒంగోలు న్యాయస్థానం తెలిపింది.

అయితే ఒంగోలు కోర్టు ఇచ్చిన తీర్పును ఎగువ కోర్టుకు అప్పీల్ చేయాలని బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై బండ్ల గణేష్ ఏ విధంగా స్పందిస్తారనే విషయాన్ని వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X