దిల్ రాజు భార్య పేరు, ఎవరు, ఏమిటో తెలుసా?.. వధువు గురించి ఆసక్తికరమైన విషయాలు..
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిరాడంబరంగా తన రెండో వివాహాన్ని చేసుకొన్నారు. కరోనా లాక్‌డౌన్ పరిస్థితులు కావడంతో అతి తక్కువ మందే ఈ పెళ్లికి హాజరయ్యారు. మొదటి భార్య అనిత మరణాంతరం ఆయన ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు తోడుగా ఉండేందుకు జీవిత భాగస్వామి అవసరమని కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన పెళ్లికి సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి.అయితే వధువు విషయంలో ముందు నుంచి సస్పెన్స్ కొనసాగడంతో పెళ్లికూతురు ఎవరనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే దిల్ రాజును పెళ్లి చేసుకొన్న అమ్మాయి పేరు ఏమిటంటే..
లాక్‌డౌన్‌లో దిల్ రాజు రెండో పెళ్లి.. సినీ ప్రముఖులు దూరం.. ఫోటోలు వైరల్..

పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలని..
వాస్తవానికి తన పెళ్లిని దిల్ రాజు గ్రాండ్‌గా సినీ, రాజకీయ ప్రముఖులందర్ని పిలిచి చేసుకోవాలని ప్లాన్ చేసుకొన్నారు. కానీ కరోనా కారణంగా ఊహించని పరిస్థితులు చోటుచేసుకోవడంతో లాక్‌డౌన్‌లోనే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారు. ఇప్పట్లో లాక్‌డౌన్ ముగిసే అవకాశం కనిపించకపోవడం, ఇక సినిమా షూటింగులు కూడా ఇప్పట్లో జరిగే విధంగా పరిస్థితులు లేకపోవడం వల్ల దిల్ రాజు వ్యక్తిగత, ఫ్యామిలీ జీవితానికే మొగ్గు చూపినట్టు తెలిసింది.
Recommended Video

నిజమాబాద్‌లో జాగ్రత్తల మధ్య
ఆదివారం నిజామాబాద్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన పెళ్లికి 20 మందిలోపే హాజరయ్యారని తెలిసింది. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా పెళ్లిలో చాలా జాగ్రత్తలు తీసుకొన్నట్టు తెలిసింది. ముఖాలకు మాస్కులు ధరించి అతిథులు జాగ్రత్తలు తీసుకొన్నారు. పరిసర ప్రాంతాలను సానిటైజ్ చేసి కరోనావైరస్ సోకకుండా జాగ్రత్తలు పాటించారని సన్నిహితులు చెప్పారు.

సోదరుడి కుమారుడు దూరం
దిల్ రాజు పెళ్లికి హాజరుకావాలని టాప్ సెలబ్రిటీలు అనుకొన్నప్పటికీ పోలీసులు, ప్రభుత్వ ఆంక్షల వల్ల సాధ్యం కాలేదని తెలిసింది. చివరకు ఈ పెళ్లికి సోదరుడి కుమారుడు హర్షిత్ రెడ్డి కూడా హాజరుకాకపోవడం గమనార్హం. కాబట్టి లాక్‌డౌన్ ఆంక్షలను విధిగా పాటించాల్సి వచ్చిందని సన్నిహితులు చెప్పారు. దిల్ రాజు సోదరులు, అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబాల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు అయ్యారు.

దిల్ రాజు భార్య పేరు
ఇక దిల్ రాజు వివాహం చేసుకొన్న అమ్మాయి అసలు పేరు వైఘారెడ్డి. అయితే ఇద్దరి జాతకాలను బట్టి వధువు పేరును మార్చారని తెలిసింది. పెళ్లికి ముందు వైఘారెడ్డి తన పేరును తేజస్వినిగా మార్చుకొన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైఘారెడ్డి వయసు 33 సంవత్సరాలు అని తెలిసింది. ఆమె దిల్ రాజు కుటుంబంలోని అతి దగ్గరి ఫ్యామిలీకి చెందిన వారుగా చెప్పారు. గతంలో కుటుంబ పరమైన రిలేషన్స్ కూడా ఇరు ఫ్యామిలీ మధ్య ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే దిల్ రాజు దంపతుల ఫోటోలు మీడియాకు రిలీజ్ చేయగా అవి ట్రెండింగ్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











