Game Changer Release Date: గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ లీక్ చేసిన దిల్ రాజు... ఎప్పుడో తెలుసా?

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత నుంచి ఇటు రామ్ చరణ్ నుంచి కానీ అటు జూనియర్ ఎన్టీఆర్ నుంచి గానీ ఎలాంటి సినిమా రాలేదు. చాలా రోజులు గ్యాప్ రావడం.. తమ అభిమాన హీరోల సినిమాలు రాకపోవడంతో అంతా నిరుత్సాహ పడుతున్నారు. ఈక్రమంలోనే వాళ్లు చేసే సినిమాల గురించి పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేయబోతున్న తాజా చిత్రం గేమ్ ఛేండర్ పై ఇప్పటికే పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది. దేశవ్యాప్తంగా చెర్రీ ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ తర్వాతి సినిమా గురించి పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు.

అయితే గేమ్ ఛేంజర్ సినిమా ప్రకటించి.. షూటింగ్ ప్రారంభం అయి చాలా రోజులు అవుతోంది. ఏడాది కాలంగా ఈ సినిమా షూటింగ్ కొననసాగుతూనే ఉంది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులు గూగుల్ లో సెర్చ్ చేస్తూ మరీ ఈ సినిమా అప్ డేట్ల గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏవైనా అప్ డేట్లు వస్తే బాగుండు అని చూస్తున్నారు. ఈక్రమంలోనే ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పి చెర్రీ అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. అయితే ఆ విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Producer Dilraju Leaked Game Changer Movie Release Date Check Here

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, కియారా అడ్వాణీ హీరోయిన్లుగా రాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో.. అంజలి, సముద్రఖని, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ పనులు చూసుకుంటున్నారు. అలాగే షమీర్ ముహమ్మద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకోగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. దిల్ రాజు హోం బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమా ఆయన కెరియర్ లో 50వ చిత్రం కావడం గమనార్హం. ఈక్రమంలోనే సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టు కావాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట దర్శక, నిర్మాతలు. అయితే తాజాగా దిల్ రాజు సలార్ సినిమా చూసేందుకు వచ్చిఈ సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఎప్పుడు విడుదల అవుతుందో ప్రకటించేశారు.

Producer Dilraju Leaked Game Changer Movie Release Date Check Here

ఇప్పటికే 90 శాతానికి పైగూ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో పూర్తి కానుండగా.. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు దిల్ రాజ్ ప్రకటించేశారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అవతున్నారు. సినిమా నుంచి ఏమైనా పాటలు కానీ, డైలాగ్ లు వంటివి విడుదల చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. చూడాలి మరి ఈ సినిమాకు సంబంధించిన ఏవైనా విషయాలు విడుదల చేస్తారా లేదా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X