twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఇస్మార్ట్ శంకర్’ లాభాల నుంచి హీరో రామ్‌కు బోనస్?

    |

    రామ్ హీరోగా రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో పాటు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది. మొదటివారం థియేటర్లన్నీ కిటకిటలాడాయి. రెండో వారంలోనూ చాలా చోట్ల హౌష్ ఫుల్ కలెక్షన్లతో తూసుకెళుతోంది.

    ఈ మూవీ వరల్డ్ వైడ్ ఫుల్ రన్‌లో రూ. 35 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తాము పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడంతో పాటు పెట్టుబడికి రెట్టింపు లాభాలు పొందారు. ఈ నేపథ్యంలో హీరో రామ్‌కు బోనస్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట నిర్మాతలు పూరి, చార్మి.

    Puri and Charmi decided to give a bonus to Ram

    హీరో రామ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వల్లే ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అయింది. ఆయనతో మున్ముందు మరిన్ని సినిమాలు చేసే ఆలోచనలో ఉన్న పూరి, చార్మి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రామ్‌కు ఇచ్చే ఆ మొత్తం ఎంత? అనేది తెలియాల్సి ఉంది.

    'ఇస్మార్ట్ శంకర్' వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 17 కోట్లకు అమ్మిన సంగతి తెలిసిందే. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని రూ. 6.50 కోట్లకు రైట్స్ అమ్మగా... ఇప్పటి వరకు 12.55 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇలా సినిమా విడుదలైన అన్ని చోట్ల పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం తెచ్చిపెట్టింది.

    రామ్ సరసన నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌, సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ, ఆర్ట్‌: జానీ షేక్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.

    English summary
    Ismart Shankar is making good profit for movie producers. Puri and Charmi decided to give a bonus to Ram. iSmart Shankar is a 2019 Indian Telugu-language science fiction action film written and directed by Puri Jagannadh, produced by Puri Jagannadh and Charmme Kaur with music composed by Mani Sharma. It stars Ram Pothineni, Nabha Natesh, Nidhhi Agerwal and Satyadev Kancharana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X