twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతా సర్దేసుకున్న పూరి, ఛార్మి.. దెబ్బకు క్లోజ్ చేసేశారు.. డైలమాలో పడ్డ ఫైటర్!

    |

    డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి ఫామ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించిన ఈ ఇద్దరూ.. సక్సెస్ బాటలో నడుస్తున్నారు. అయితే తాజాగా ఈ పూరి కనెక్ట్స్ ఆఫీసుకు తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయాన్ని ఛార్మినే అఫీషియల్‌గా ప్రకటించింది. ఆ వివరాలేంటో చూద్దామా..

    Recommended Video

    Vijay devarakonda - Puri Jagannath's Fighter Movie Update | VD 10
    ఛార్మి బిజినెస్ ఆలోచన.. పూరితో!!

    ఛార్మి బిజినెస్ ఆలోచన.. పూరితో!!

    సినిమాల్లో నటించడం మానేసిన ఛార్మి.. బిజినెస్ పరంగా సరికొత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగుతోంది. వెండితెరపై కనిపించనని ఇప్పటికే కన్ఫర్మ్ చేసిన ఈ బ్యూటీ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాలు నిర్మించే పనిలోపడ్డ సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభించించిన పూరి జగన్నాథ్, ఛార్మీలు ఈ బ్యానర్‌పై పలు సినిమాలు రూపొందిస్తున్నారు.

    పూరి కనెక్ట్స్.. పరిస్థితుల ప్రభావంతో ఆఫీస్ క్లోజ్

    పూరి కనెక్ట్స్.. పరిస్థితుల ప్రభావంతో ఆఫీస్ క్లోజ్

    ఈ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమా రూపొందించి భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న ఈ ఇద్దరూ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'ఫైటర్' సినిమా రూపొందించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. కానీ పరిస్థితుల కారణంగా పూరి కనెక్ట్స్ ఆఫీస్ క్లోజ్ చేయాల్సి వచ్చింది.

    కరోనా ఎఫెక్ట్.. సినిమా వాళ్లంతా!

    కరోనా ఎఫెక్ట్.. సినిమా వాళ్లంతా!

    ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ విజృంభణ కొనసాగుతున్న కారణంగా పలు ఆఫీసులు, సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్, సినిమా షూటింగ్స్ క్లోజ్ చేసేశారు. 15 రోజుల పాటు జన సమూహం ఉండే ప్రదేశాలపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. దీంతో సినిమా వాళ్లంతా కంప్లీట్ రెస్ట్ తీసుకుంటున్నారు.

    తప్పలేదు.. కారణమిదే..

    తప్పలేదు.. కారణమిదే..

    ఈ నేపథ్యంలో పూరీ కనెక్ట్స్‌ (పీసీ) సంస్థ కూడా అదే బాటలో నడిచింది. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో అడ్మినిస్ట్రేషన్‌, ప్రొడక్షన్‌ వర్క్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి నుండి తన ఆఫీస్ స్టాఫ్‌ను, ప్రజానికాన్ని కాపాడుకునేందుకు ప్రస్తుతానికి ఆఫీస్ క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటించి, కరోనాపై సమిష్టిగా పోరాడాలని పేర్కొన్నారు పూరి, ఛార్మి.

    డైలమాలో పడ్డ ఫైటర్! అప్పుడే క్లారిటీ..

    దీంతో పూరీ కనెక్ట్స్‌ బ్యానర్ పై రూపొందుతున్న తాజా సినిమా ఫైటర్ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ వాయిదా పడింది. హైదరాబాద్ లో త్వరలోనే ప్రారంభం కావాల్సిన తదుపరి షెడ్యూల్ డైలామాలో పడింది. కరోనా ఎఫెక్ట్ తగ్గాక ఈ షెడ్యూల్ పై క్లారిటీ రానుంది.

    English summary
    Director puri jagannadh and Charmy Kaur takes a decision to close Puri Connects office due to CoronaVirus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X