టాలీవుడ్ నెవర్ బిఫోర్ కాంబినేషన్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ. ఈ కాంబినేషన్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా రౌడి స్టార్ సరికొత్త లుక్కుతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన రూమర్స్ అయితే చాలానే వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే 40% శాతం షూటింగ్ అయితే పూర్తయ్యింది.
ఇక త్వరలో ఒక స్పెషల్ అప్డేట్ రానున్నట్లు టాక్ వస్తోంది. ఒక సీనియర్ హీరోను కీలకమైన పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నారట. అదే విషయాన్ని చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సీనియర్ నటుడు మరెవరో కాదు. మలయాళం ఇండస్ట్రీలో వందల సినిమాల్లో నటించిన సురేష్ గోపి. హీరోగానే కాకుండా పాత్ర నచ్చితే విలన్ గా కూడా నటిస్తున్నారు ఆయన. శంకర్ ఐ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు విజయ్ ఫైటర్ సినిమాలో తండ్రి పాత్రలో నటించే అవకాశం ఉందట.
దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అందుకే అన్ని భాషల నటులను ఎంచుకుంటున్నట్లు అర్ధమవుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ అయితే ఈ డిసెంబర్ లో రానున్నట్లు టాక్ వస్తోంది. మరి దర్శకుడు పూరి జగన్నాథ్ ఎలాంటి కిక్కిస్తాడో చూడాలి. పూరి జగన్నాథ్ ఫైటర్ తరువాత చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ పై కూడా త్వరలోనే వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం.
Puri jagannadh daughter pavitra puri latest photos viral, Charmy Kaur worked hard to succeed as a heroine. The characters who preferred acting also did a lot. But her misfortune was not as successful as she had hoped. Her career took another U-turn after the Jyoti Lakshmi movie with Puri Jagannath. She put the end card to the performance and went down to the production house.
Story first published: Wednesday, November 25, 2020, 12:27 [IST]