twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ రిజెక్ట్ చేసిన కధతోనే పాన్ ఇండియా.. డ్రీమ్ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చిన పూరి జగన్నాథ్!

    |

    డ్యాషింగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఎలాంటి హీరోతో వర్క్ చేసినా తన మార్క్ కనిపించేలా సినిమాను తెరకెక్కించే పూరి ఫైనల్ గా తన డ్రీమ్ ప్రాజెక్టుపై ఒక క్లారిటీ ఇచ్చాడు. గతంలో మహేష్ బాబుతో డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలని పూరి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఎందుకో మహేష్ ఆ కథను రిజెక్ట్ చేశాడు.

    డ్రీమ్ ప్రాజెక్ట్..

    డ్రీమ్ ప్రాజెక్ట్..

    పూరి జగన్నాథ్ తన కెరీర్ లో బిగ్ హిట్స్ తో పాటు దారుణమైన అపజయాలని కూడా చూశాడు. అయితే కెరీర్ లో ఆ సినిమాలన్నీటిని మించిన రేంజ్ లో ఒక బిగ్ బడ్జెట్ లో డ్రీమ్ ప్రాజెక్టును తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. అదే జనగణమన ప్రాజెక్ట్. ఈ కథను ఎప్పుడో పూర్తి చేసినప్పటికీ ఇంకా సెట్స్ పైకి రావడం లేదు.

    జనగణమన..పాన్ ఇండియా

    జనగణమన..పాన్ ఇండియా

    జనగణమన సెట్స్ పైకి రాకపోవడానికి కారణం పూరి అపజయాలు. ఆ మధ్య బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ రావడంతో సినిమాను సెట్స్ పైకి తీసుకురాలేకపోయాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి రావడంతో పాన్ ఇండియా లెవెల్లో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరో ఎవరన్నది ఇంకా చెప్పలేదు. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

    మహేష్ నో చెప్పిన కథ..

    మహేష్ నో చెప్పిన కథ..

    ఇక మొదట జనగణమన కథను విన్న మహేష్ ఎలాగైనా చేస్తానని అన్నాడు. కానీ కొన్ని మార్పులు కావాలని చెప్పడంతో పూరి చాలా సార్లు కథను మార్చాడు. ఎంత మార్చినా కూడా మహేష్ ఒప్పుకోలేదు. మహేష్ ఎలాగైనా ఒప్పుకుంటాడేమో అని పలుమార్లు పూరి జగన్నాథ్ జనగణమన మహేష్ తో ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే చివరికి మహేష్ పూరి జగన్నాథ్ ని కట్ చేశాడని ఒక టాక్ వచ్చింది.

    Recommended Video

    Sushant Singh Rajput : సుశాంత్ కేసు లో Rhea Chakraborty పై కేసు వేసిన Sushant అభిమాని
    మహేష్ బాబుతో చేయలేను..

    మహేష్ బాబుతో చేయలేను..

    గతంలో పూరి కూడా మహేష్ పై చేసిన కామెంట్స్ తో ఆయనతో మళ్ళీ వర్క్ చేసే ఛాన్స్ లేదని తెలిసిపోయింది. మహేష్ కంటే కూడా ఆయన అభిమానులు అంటే చాలా ఇష్టమని.. నేను ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు సినిమా చేయలేదు. అలాంటిది నేను సక్సెస్ వచ్చిన తరువాత ఆయనతో సినిమా ఎలా చేస్తాను..అని పూరి జగన్నాథ్ సమాధానం ఇచ్చాడు.

    English summary
    Today's directors are trying their best to make a movie with Tollywood superstar Mahesh Babu. To make a film with Mahesh Babu you do not need to consult him. There is a talk in the industry that if hit, he will call and give him a chance. However, the two star directors are again talking about Mahesh Babu's movie Chance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X