‘లైగర్’ కోసం రంగంలోకి దిగిన పూరి.. హీరోయిన్‌తో ముచ్చట్లు పెడుతున్న డైరెక్టర్
పూరి జగన్నాథ్ తన సినిమాలను ఎంత ఫాస్ట్‌గా ఫినిష్ చేసేస్తాడో అందరికీ తెలిసిందే. పక్కా ప్లానింగ్‌తో ఒకసారి రంగంలోకి దూకాడంటే వెనుకడుగు వేసేదే ఉండదు. స్టార్ హీరో సినిమాలైనా సరే దాదాపు 60, 70 రోజుల్లో ముగించేస్తాడు. కానీ పూరి జగన్నాథ్ వేగానికి కరోనా అడ్డుకట్ట వేసేసింది. లైగర్ సినిమాను ఎంతో వేగంగా ఫినిష్ చేద్దామని పూరి ప్రయత్నించాడు. దానికి తగ్గట్టే అంతా ప్లాన్ చేసుకున్నాడు.
అలా మొదటి షెడ్యూల్ కానిచ్చాడు. ఆ వెంటనే కరోనా, లాక్డౌన్ వంటివి వచ్చాయి. అలా దాదాపు ఏడాది పాటు షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టకుండా నాలుగు గోడల మధ్యే ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు పూరి జగన్నాథ్ లైగర్ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ముందుగానే డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. సెప్టెంబర్ 9న లైగర్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించేశారు.

నిన్నటి నుంచి షూటింగ్ కూడా మొదలెట్టేశాడు. తాజాగా షూటింగ్ సెట్ నుంచి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో పూరి జగన్నాథ్ హీరోయిన్‌తో ముచ్చట్లు పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఏదో సీన్ కోసం ఇద్దరూ చర్చించుకున్నట్టున్నారనిపిస్తోంది. అయితే ఈ సీన్‌లో విజయ్ దేవరకొండ ఎక్కడా కనిపించలేదు. మొత్తానికి పోస్టర్లతోనే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











