మరో అడుగు ముందుకేసిన పూరి, ఛార్మి.. డోస్ పెంచేసి రొమాన్స్

Recommended Video

Puri Jagannadh And Charmy Creating Sensation With Romance In 'Ismart Shankar' || Filmibeat Telugu

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి ఈ సారి మరింత డోస్ పెంచేశారు. ఈ రోజుల్లో కుర్రకారు కోరుకునేది ఏంటనే విషయాన్ని పసిగట్టిన పూరి జగన్నాథ్ తన స్టైల్ కి ఇంకాస్త పదును పెట్టాడు. ఇక అందాలు ఆరబోయడం, రొమాన్స్ చేయడం లాంటి వాటిలో ఛార్మిది అందిన చేయి. ఇటీవలే తెరపై అందాలకు బై బై చెప్పిన ఈమె తెర వెనుక నుండే ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తోంది. పూరితో కలిసి రొమాంటిక్ సినిమాలు రూపొందిస్తూ కుర్రకారుకు వల వేస్తోంది.

పూరి జగన్నాథ్, ఛార్మి ఇద్దరూ కలిసి

పూరి జగన్నాథ్, ఛార్మి ఇద్దరూ కలిసి

సినిమా తెరపై అందాల ఆరబోతకు విరామం ఇచ్చిన ఛార్మి.. పూరితో కలిసి పూరి కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా సినిమాలు నిర్మిస్తూ నాలుగు డబ్బులు వెనకేసుకుంటోంది చార్మింగ్ బ్యూటీ. ఈ కోవలోనే పూరి జగన్నాథ్, ఛార్మి ఇద్దరూ కలిసి ప్రస్తుతం నిర్మిస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రంలో రొమాంటిక్ డోస్ ఫుల్లుగా ఉండేలా చూసుకున్నారు.

ఇటీవలే దిమాక్ ఖరాబ్

ఇటీవలే దిమాక్ ఖరాబ్

ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఈ ఇద్దరూ ఇటీవలే దిమాక్ ఖరాబ్ అనే లిరికల్ సాంగ్ వదిలి యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఈ పాటలో నిధి అగర్వాల్, నభా నటేష్ అందాలు, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చిందులు కుర్ర హృదయాలను మాయ చేశాయి. ఇలా ఆడియన్స్ దిమాక్ ఖరాబ్ చేస్తూ తమ సినిమాపై హైప్ క్రియేట్ చేసుకున్నారు టాలెంటెడ్ పూరి అండ్ ఛార్మి.

ఇది చాలదన్నట్లు డోస్ పెంచి రొమాన్స్

ఇస్మార్ట్ శంకర్ దిమాక్ ఖరాబ్ పాటతోనే ప్రేక్షకుల దిమాక్ ఖరాబ్ చేసిన వీళ్ళు.. ఇది చాలదన్నట్లు డోస్ పెంచి మరో పాట విడుదల చేశారు. 'జిందాబాద్ జిందాబాద్' అంటూ రామ్, నభా నటేష్ ల మధ్య సాగే ఒక రొమాంటిక్ సాంగ్ ఇది.మాల్దీవ్స్ లోని బీచ్ లొకేషన్ లో చిత్రీకరించిన ఈ పాటలో రొమాన్స్ డోస్ బాగా పెంచేశారు. శరత్ సంతోష్, రమ్య బెహరా పాడిన ఈ పాటలో నభా నటేష్ అందాలు అబ్బుర పరుస్తున్నాయి.

ఇస్మార్ట్ శంకర్ మూవీ

ఇస్మార్ట్ శంకర్ మూవీ

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు ''డబుల్ దిమాక్'' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో ఛార్మి, పూరి జగన్నాథ్ నిర్మాణంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తుండగా.. నిధి అగర్వాల్, నభా నటేష్ ఆయనతో చిందులేస్తున్నారు. జులై 12వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X