నానా సంకలు నాకుతున్నా.. వాళ్లు మగాళ్లేనా? డిస్టిబ్యూటర్లపై పూరీ జగన్నాథ్ బూతుల వర్షం
లైగర్ డిజాస్టర్ కావడంతో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు భారీ నష్టాల్లో కూరుకుపోయారు. అయితే నష్టాల్లో కూరుకుపోయిన వారందరూ హైదరాబాద్‌లో అక్టోబర్ 27వ తేదీన పూరీ జగన్నాథ్ ఇంటి వద్ద ధర్నాకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్‌కు డిస్టిబ్యూటర్లు లేఖ పంపించారు. ఈ లేఖ అందుకొన్న పూరీ తన మిత్రుడితో మాట్లాడుతూ..

ఓవరాక్షన్ చేస్తే..
నీవు పంపించిన లెటర్ చూశాను. డిస్టిబ్యూటర్ శోభన్ బాబు నాకు కూడా లెటర్ పంపించారు. మీడియాలో చాలా సర్కులేట్ అవుతున్నది. వాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. నష్టపోయిన వారికి డబ్బులు ఇస్తానని చెప్పాను. ఒక నెల సమయం అడిగాను. నాకు రావాల్సిన డబ్బులు రాలేదు. ఇస్తానని చెప్పిన తర్వాత ఓవరాక్షన్ చేస్తే.. సహించను. నా పరువు తీయాలని చూస్తే.. ఒక్క రూపాయి ఇవ్వను అని పూరీ జగన్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మగాళ్లు ఎవరు లేరు అంటూ
అయినా ఎగ్జిబిటర్లకు నాకు సంబంధం ఏమిటి? ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. పేకాట ఆడుతున్నాం. పోతే ఎవరినైనా అడుగుతున్నానా? వీళ్లలో మగాళ్లు ఎవరు లేరు. ఒకవేళ సినిమా హిట్ అయితే.. వీరి వద్ద నుంచి డబ్బు తీసుకోవడానికి నానా సంకలు నాకాల్సిందే. పోకిరి నుంచి నాకు రావాల్సిన డబ్బులు చాలా ఉన్నాయి అని పూరీ జగన్నాథ్ అన్నారు.

ఎవడు రోడ్ల మీద పడరు..
లైగర్ సినిమా కొన్న వాళ్లందరూ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్. మా డిస్టిబ్యూటర్ శోభన్ బాబు అయితే ఇండస్ట్రీలో కోట్లు కోట్లు అప్పులు ఇస్తుంటాడు. ఎగ్జిబిటర్ అంటే.. థియేటర్ ఓనర్. ఇక్కడ ఎవడు తక్కువేం కాదు. ఒక సినిమా దెంxxతే ఎవరు రోడ్ల మీద పడరు. సినిమా తీసినప్పుడు బాగా తీస్తాం. రిలీజ్ చేసేటప్పుడు డిస్టిబ్యూటర్లను డీల్ చేయడం చాలా కష్టం అని ఆడియో టేప్‌లో పూరీ జగన్నాథ్ బూతులతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

లెక్కలు కరెక్ట్‌గా చెబుతారు..
లైగర్ సినిమా హిందీ వెర్షన్‌ను అనిల్ తరానికి ఇచ్చాం. అతడి లెక్కలు ఎంత కరెక్ట్‌గా ఉంటాయో తెలుసా? మేము అనుకొన్నదానికంటే ఎక్కువ వచ్చినా మాకు తెచ్చి ఇస్తారు. అతడు వస్తే కూర్చొని మాట్లాడాలని అనిపిస్తుంటుంది. మన బయ్యర్లు వస్తే.. లేచి దెంXXయాలనిపిస్తుంది. ధర్నా చేయనివ్వండి.. చేసిన వాళ్లవి లిస్ట్ తీసుకొంటా. మిగితా వారికి డబ్బులు ఇస్తాను అని పూరీ జగన్నాథ్ కోపంతో ఊగిపోయారు.

డిస్టిబ్యూటర్ల మౌనం..
పూరీ జగన్నాథ్ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే డిస్టిబ్యూటర్లపై పూరీ చేసిన తీవ్ర ఆరోపణలకు మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. అయితే పూరీ ఆడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో డిస్టిబ్యూటర్లు ఇంకా స్పందించలేదు. పూరీ జగన్నాథ్ చేసిన బెదిరింపులకు డిఫెన్స్‌లో పడ్డారా? అనే ప్రశ్న సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











