పూరి జగన్నాథ్ తమ్ముడు మళ్ళీ వస్తున్నాడు.. రీ సౌండ్

టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన పూరి జగన్నాథ్ ఎంతో మంది హీరోలకు బాక్సాఫీస్ హిట్టిచ్చాడు. అయితే బ్యాడ్ లక్కేమిటో గాని ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం సరైన హిట్ ఇవ్వలేకపోయాడు. కొడుకు ఆకాష్ పూరితో మెహబూబా అనే సినిమా తీసిన పూరి ఊహించని విధంగా డిజాస్టర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆకాష్ రొమాంటిక్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమాను పూరి నిర్మిస్తుండగా ఆయన శిష్యుడు అనిల్ దర్శకత్వం వహించాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. కొడుకు కంటే ముందే పూరి జగన్నాథ్ తన తమ్ముడైన సాయి రామ్ శంకర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయించాడు. 143 సినిమాతో హీరోగా పరిచయం చేయించిన పూరి.. సాయి రామ్ కు అనుకున్నంత రేంజ్ లో హిట్టివ్వలేకపోయాడు. మధ్యలో శిష్యులతో హలో ప్రేమిస్తారా? బంపర్ ఆఫర్ వంటి సినిమాలు కూడా నిర్మించాడు గాని వర్కౌట్ కాలేదు. ఇక ఫైనల్ గా సాయి రామ్ తన సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నం చేశాడు.

 Puri jagannadh brother sai ram shankar upcoming movie update

ఇక చాలా రోజుకు తరువాత "రీ సౌండ్" విభిన్నమన సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకున్న రీ సౌండ్ సినిమా కరోనా కారణంగా ఆగిపోగా ఇప్పుడు మళ్లీ స్టార్ట్ చేశారు. మాస్ కమర్షియల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై సాయి రామ్ గట్టి నమ్మకంతోనే ఉన్నాడు. మరి ఈ సారైనా బాక్సాఫీస్ వద్ద ఏదైనా మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి. మరోవైపు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X