తారక్ ఇపుడు మారిన మనిషి, పాత విషయాలు తవ్వొద్దు: పూరి కామెంట్లపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం!

Recommended Video

Puri Jagannadh Comments On Jr NTR Rash Driving || Filmibeat Telugu

డ్రగ్స్ కేసు తర్వాత మీడియాకు వీలైనంత దూరంగా ఉంటూ వస్తున్న పూరి జగన్నాధ్ తన తాజా చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు టీవీ ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నారు. దొరక్క దొరక్క దొరికిన పూరి నుంచి ఆసక్తికర విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు మీడియావారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబుపై పూరి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన హిట్లలో ఉండే డైరెక్టర్లతో మాత్రమే సినిమా చేయడానికి ఆసక్తి చూపుతారు, ప్లాపుల్లో ఉండే డైరెక్టర్లతో చేయడానికి ఇష్టపడరు. తనతో 'జన గణ మన' సినిమా చేయకపోవడానికి కారణం అదే. ఇప్పుడు మహేష్ నాతో చేయడానికి ఒప్పుకున్నా... నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాకంటూ ఓ క్యారెక్టర్ ఉంటుంది కదా? అంటూ పూరి వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.

అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇపుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ గరం

అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇపుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ గరం

పూరి చేసిన సదరు కామెంట్లతో మహేష్ బాబు ఫ్యాన్స్ గరం గరం అయ్యారు. పూరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇపుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పూరిపై గుర్రుగా ఉన్నారు. అందుకు కారణం ఎన్టీఆర్ రాష్ డ్రైవింగ్ గురించి ఈ డాషింగ్ డైరెక్టర్ కామెంట్లు చేయడమే.

ఎన్టీఆర్ డ్రైవింగ్ గురించి పూరి ఏమన్నారంటే...

ఎన్టీఆర్ డ్రైవింగ్ గురించి పూరి ఏమన్నారంటే...

టెంపర్ మూవీ సమయంలో మీకు గుర్తుండి పోయే మూమెంట్స్ ఏమిటి? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పూరి స్పందిస్తూ.. ఆ మూవీ గోవాలో షూట్ చేశాం. రోజూ తారక్‌తో కలిసి షూటింగుకు వెళ్లడం, ఆ క్యారెక్టర్ ఎంజాయ్ చేయడం నచ్చింది. రోజూ ఈవినింగ్ తారక్ కారు ఎక్కించుకుంటాడు. నేను డ్రైవ్ చేస్తా కూర్చో అంటాడు. అతడు కారు తోలే తీరు చూసిన తర్వాత ఎన్టీఆర్ డ్రైవింగ్ చేయకుంటే బావుండు అనే ఫీలింగ్ వస్తుంది... అని వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ అవన్నీ చెబుతాడు కానీ...

ఎన్టీఆర్ అవన్నీ చెబుతాడు కానీ...

ఎన్టీఆర్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి అని చెబుతుంటాడు కదా... అనే ప్రశ్నకు పూరి రియాక్ట్ అవుతూ ‘‘తారక్ అలా అంటాడు కానీ మనం చెబితే డ్రైవింగ్ విషయంలో అస్సలు వినడు, తనకు నచ్చినట్లుగా చేస్తాడు'' అంటూ పూరి చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

ఎన్టీఆర్ ఇపుడు మారిపోయాడంటున్న ఫ్యాన్స్

ఎన్టీఆర్ ఇపుడు మారిపోయాడంటున్న ఫ్యాన్స్

తారక్ ఇపుడు మారిన మనిషి, డిసెంబర్ 2014లో తన సోదరుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత తారక్ చాలా మారిపోయారని, అప్పటి నుంచి ఆయన నిజాయితీగా రోడ్డు సేఫ్టీపై ప్రజలను చైతన్యం చేయమే కాదు, తను కూడా కూడా పాటిస్తున్నాడు, పూరి జగన్నాధ్ ఈ విషయం గుర్తించాలి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X