నా బూతులంటే పవన్‌కు చాలా ఇష్టం.. బాంబు పేల్చిన బడా డైరెక్టర్

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పలానా సినిమా పూరీదే అని ప్రతి ఒక్కరూ గుర్తు పట్టే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. లవ్, రొమాన్స్, హీరోయిజం చూపించడంలో పూరీని మించిన వారు లేరనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. అలాంటి స్టార్ డైరెక్టర్ వరుస పరాజయాలతో సతమతమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' భారీ విజయాన్ని అందుకుంది.

పక్కా మాస్ మసాలా కథతో తెరకెక్కిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మొదట్లో మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ క్రమ క్రమంగా హిట్ చిత్రాల జాబితాలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పూరీ కమ్ బ్యాక్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమా హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది. అలాగే, భారీ కలెక్షన్లనూ సాధిస్తోంది. ఇప్పటికే రామ్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్ల రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టేసింది.

Puri Jagannadh Comments On Pawan Kalyan

'ఇస్మార్ట్ శంకర్' విజయంతో పూరీ జగన్నాథ్ ఉత్సాహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అంతేకాదు, ఇందుకోసం ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో జరిగిన పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు.

ఈ సమయంలోనే బూతుల గురించి ప్రస్తావన రావడంతో పవన్ పేరు వచ్చింది. ''నాకు బూతులు ఎక్కువగా వస్తుంటాయి. నేను బయట కూడా ఎక్కువగా మాట్లాడుతుంటాను. వాస్తవానికి అవి బూతులని నాకు తెలియదు. ఒకసారి పవన్ కూడా నువ్వు బూతులు మాట్లాడుతుంటే.. అవి అలా అనిపించడం లేదు. వాస్తవానికి నాకు బూతులు మాట్లాడే వాళ్లంటే ఇష్టం ఉండదు. కానీ, నువ్వు మాట్లాడుతుంటే బాగుంది అని చెప్పారు'' అంటూ పూరీ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X