twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Myke Tyson లైగర్‌లోకి ఎలా వచ్చాడంటే.. చార్మీదే ఆ క్రెడిట్.. లవ్యూ అంటూ పూరీ ఎమోషనల్

    |

    లైగర్ సినిమాలో మైక్ టైసన్‌ను పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు. అతడిని ఈ ప్రాజెక్టులోకి తీసుకు రావడానికి ఒక సంవత్సరం పట్టింది. ఆ క్రెడిట్ అంతా ఛార్మిదే. ఎందుకంటే..మైక్ టైసన్‌ టీమ్‌ను కన్విన్స్ చేయడానికి చాలా సమయం పట్టింది అంటూ పూరీ జగన్నాథ్ తెలిపారు. వరంగల్‌లోని మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో ఫ్యాన్‌డమ్ టూర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..

    మైక్ టైసన్ రాకపోతే

    మైక్ టైసన్ రాకపోతే

    మైక్ టైసన్ టీమ్‌కు స్క్రిప్టు పంపితే.. ఇది ఆయన చేయడు అని మైక్ టైసన్ టీమ్ చెబుతారు. వంద జూమ్ కాల్స్ జరిగాయి. రకరకాల చర్చలు జరిగాయి. చివరకు వాళ్లు మైక్ టైసన్ షూటింగ్‌కు వస్తారని టైమ్ ఇచ్చారు. దాంతో లాస్ వెగాస్‌లో అక్కడికి టీమ్‌తో షూటింగుకు ఏర్పాట్లు చేశాం. అయినా మైక్ టైసన్ వస్తాడో లేదో తెలియదు. ఆ కంగారులో ఉంటే.. ఒకరు వచ్చి..మైక్ టైసన్ రాకపోతే పరిస్థితి ఏమిటని అడిగితే.. నాకు ఉచ్చ పడింది. మేము అలా టెన్షన్‌లో ఉంటే.. మైక్ టైసన్ వచ్చి.. వాట్స్ ది ఫక్ హ్యాపెనింగ్ అంటూ షూటింగుకు వచ్చారు.

    మైక్ టైసన్ కాలి షూ సైజు 20

    మైక్ టైసన్ కాలి షూ సైజు 20


    ప్రపంచంలో బ్రూస్ లీ తర్వాత అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి మైక్ టైసన్. అలాంటి లెజెండ్‌తో షూటింగ్ చేశాం. ఆయన పక్కనే కూర్చొని.. ఇదంతా నిజమేనా అని విజయ్, నేను ముఖాలు చూసుకొనే వాళ్లం. అతడి పక్కనే పెద్ద జంతువు పక్కన కూర్చొన్నామా అనేది అనిపించేది. ఆయన కాలి షూ సైజు 20. అలాంటి కాలు ఎవడికైనా ఉంటుందా? అతడికి ప్రత్యేకంగా షూస్ చేయించాం. కేజ్‌లో విజయ్ దేవరకొండతో ఫైట్ ఉండదు అని పూరీ జగన్నాథ్ క్లారిటీ ఇచ్చారు.

    అనన్య పాండే అందగత్తె కాదు..

    అనన్య పాండే అందగత్తె కాదు..


    ఇక అనన్య పాండే గురించి చెబుతూ.. ఆమె అంత అందగత్తే కాదు. కానీ మంచి ఫెర్ఫార్మర్. చాలా మంచి యాక్టర్. ఆమె ఫైర్ బ్రాండ్. విజయ్ దేవరకొండతో ఉండే సీన్లు బాగుంటాయి. మగవాళ్లపై ఆడవాళ్లు అరిస్తే నాకు ఇష్టం. ఈ సినిమా లవ్ స్టోరి. ఈచిత్రంలో రమ్యకృష్ణ విజయ్ దేవరకొండకు తల్లిగా యాక్ట్ చేస్తున్నారు. రెబల్ తల్లి. ఆవిడతో పనిచేయడం మొదటిసారి. సినిమా చూసిన తర్వాత అందరూ అలాంటి తల్లి ఉండాలని కోరుకొంటారు అని పూరీ జగన్నాథ్ అన్నారు.

    ఛార్మీ.. మగాళ్ల కంటే ఎక్కువగా

    ఛార్మీ.. మగాళ్ల కంటే ఎక్కువగా


    ఇక ఛార్మీ గురించి చెప్పాలంటే.. సినిమా కోసం మగాళ్ల కంటే ఎక్కువగా కష్టపడి పనిచేసింది. ఎలాంటి కష్టాలు ఉన్నా నా వద్దకు రానివ్వదు. నాకు టెన్షన్ లేకుండా అన్ని పనులు చేసి పెడుతుంది. ఒక్కోసారి ఏడుస్తుంటుంది. కానీ నాకు చెప్పదు. ఏ ప్రొడ్యూసర్‌కు కష్టాలు లేకుండా సినిమా పూర్తి కాదు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. విజయ్‌తో షేర్ చేసుకొంటుంది. నాట్ ఓన్లీ ప్రొడక్షన్. పబ్లిసిటీ అన్నీ చక్కగా ప్లాన్ చేసుకొంటారు. ఈ సినిమాను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. లవ్ యూ.. అని పూరీ జగన్నాథ్ ఎమోషనల్ అయ్యారు.

    ఆలీకి నాపై చాలా ప్రేమ

    ఆలీకి నాపై చాలా ప్రేమ


    ఆలీ గురించి మాట్లాడుతూ.. నాకు ఇష్టమైన నటుడు. నేను ఆయనతో కలిసి చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. నాకు కష్టాల్లో కూడా తోడు ఉంటారు. నాపై ఎంత ప్రేమ ఉంటే.. ఇలా స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తారు చెప్పండి. రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను, చంకీ పాండే కీలక పాత్రల్లో నటించారు. విషు రెడ్డి యాక్టర్‌గా నాకు తెలుసు. ఆయన ఎంఎంఎస్ ఫైటర్. ఎన్నో మెడల్స్ గెలుచుకొన్నారు. ఆయన పూరీ కనెక్ట్స్‌కు సీఈవో అని పూరీ అన్నారు. ఎడిటర్ జునైద్, సినిమాటోగ్రాఫర్ విష్ణుశర్మకు థ్యాంక్స్. మా పీఆర్వోలు వంశీ శేఖర్‌కు థ్యాంక్స్ అని పూరీ జగన్నాథ్ తెలిపారు.

    ఎర్రబెల్లి దయాకర్ గురించి

    ఎర్రబెల్లి దయాకర్ గురించి


    ఇక మా అన్నయ్య ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎప్పుడు వరంగల్ వచ్చినా మమ్మల్ని బాగా చూసుకొంటారు. ఇంటికి తీసుకెళ్లి భోజనం పెడుతుంటారు. మమ్మల్ని బాగా ప్రేమిస్తారు. అందుకు థ్యాంక్స్. ఈ సినిమా మసాలా మూవీ. ఆగస్టు 25న సినిమా వస్తుంది. థియేటర్‌లో ఈ సినిమాను చూడండి అని పూరీ జగన్నాథ్ స్పీచ్‌ను ముగించారు

    English summary
    Liger Fandom Tour Event organised in Warangal by Puri Connects. Here is the Puri Jagannadh emotional Speech about Charmme Kaur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X