'జనగణమన' కథను ఇంట్రెస్టింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేసుకున్న పూరి!
సీనియర్ డ్యాషింగ్ అండ్ డేరింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా పాన్ ఇండియా భట పట్టిన విషయం తెలిసిందే. రాజమౌళి తరువాత మెల్లమెల్లగా సీనియర్ దర్శకులు భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక త్వరలో పూరి జగన్నాథ్ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులను వధలబోతున్నాడు. విజయ్ దేవరకొండతో ఇప్పటికే ఒక సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ఆ సినిమా అనంతరం పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. జనగణమన అనే కాన్సెప్ట్ ని మహేష్ బాబుతో చేయాలని అనుకున్న పూరి ఇప్పుడు వేరే హీరోతో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నాడు. అందుకు సంబంధించిన పూర్తి కథను కూడా సిద్ధం చేసుకున్నాడు. అయితే ఆ సినిమా పూర్తిగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట.

ఆర్మీ ఆఫీసర్ గా కథానాయకుడు కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు పూరి ఎలాంటి హీరోను సెలెక్ట్ చేసుకుంటాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అనుకున్నప్పటికి ఆ కాంబినేషన్స్ సెట్ కావని తేలిపోయింది. మరి పూరి ఎవరిని సెలక్ట్ చేసుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











