లైగర్‌తో బాక్సింగ్ గాడ్.. మైక్ టైసన్ పని పూర్తి చేసిన పూరి జగన్నాథ్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మన యువ హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇక బిగ్ బడ్జెట్ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి తెరపైకి రాబోతున్నాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా త్వరలోనే లైగర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మొదటిసారి విజయ్ కెరీర్ లోనే కాకుండా డైరెక్టర్ పూరి జగన్నాథ్ జీవితంలో కూడా అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. లైగర్ సినిమా కోసం దర్శకుడు పూరి తన జీవితంలో మొదటి సారి అత్యధిక సమయాన్ని కేటాయించాడు. సాధారణంగా ఈ దర్శకుడు ఏ సినిమా చేసినా కూడా ఏడెనిమిది నెలల లోపే ఫినిష్ చేసే పూరి జగన్నాథ్ ఈ సారి లైగర్ సినిమా కోసం మాత్రం దాదాపు రెండు నెలలపాటు కష్టపడ్డాడు.

Puri Jagannadh liger usa schedule finished with mike Tyson

కరోనా లేకపోయి ఉంటే ఈ సినిమాను ఈపాటికే ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చి ఉండేవారు. లైగర్ సినిమాలో ప్రతి అంశం కూడా ప్రేక్షకుల ఊహలకు అందని స్థాయిలో ఉంటుంది అని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఇక సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో వరల్డ్ బాక్సింగ్ గాడ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మైక్ టైసన్ పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. సెకండాఫ్ క్లైమాక్స్ లో వచ్చే అతని సీన్స్ సినిమాలో హై వోల్టేజ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయని తెలుస్తోంది.

హీరో విజయ్ దేవరకొండ కూడా మొదటిసారి ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఫస్ట్ హాఫ్ లో నేషనల్ బాక్సర్ గా కనిపించబోయే విజయ్ సెకండాఫ్ లో మాత్రం ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. ఇటీవల మైక్ టైసన్ తో అమెరికాలో ఒక ప్రత్యేకమైన షెడ్యూల్ ను పూర్తి చేశారు.

Puri Jagannadh liger usa schedule finished with mike Tyson

అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మైక్ టైసన్ తో ఇన్ని రోజులు చాలా సంతోషంగా గడిపినట్లు వివరణ కూడా ఇచ్చారు. దర్శకుడు పూరి జగన్నాథ్ సహనిర్మాత చార్మి అలాగే విజయ్ దేవరకొండ కూడా మైక్ టైసన్ తో ప్రత్యేకంగా లంచ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేసేందుకు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అదే రోజున మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కూడా విడుదల కాబోతోంది. మరి ఈ బాక్సాఫీస్ పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారు చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X