Double Ismart: అదిరిపోయే కాంబినేషన్లో మరో ఊర మాస్ మూవీ.. అప్పుడే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన పూరి!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న పూరి జగన్నాథ్ గత ఏడాది లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత వెంటనే విజయ్ దేవరకొండ తో మరో సినిమా చేయాలని అనుకున్నాడు. జనగణమన అనే ఆ ప్రాజెక్టు పై అఫీషియల్ గా ఒక క్లారిటీ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఊహించిన విధంగా ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ కు వచ్చే విధంగానే అదిరిపోయే కాంబినేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి కసిగా ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని పూరి సరికొత్త కథతో రెడీ అయినట్లుగా తెలుస్తోంది. 2019లో రామ్ పోతినేని హీరోగా వచ్చిన కంప్లీట్ మాస్ మసాలా యాక్షన్ మూవీ ఈస్మార్ట్ శంకర్ ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా దాదాపు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు ముందుగానే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకోవడం విశేషం. ఈ సినిమాను మహాశివరాత్రి సందర్భంగా 2024 మార్చి 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు.
త్రిశూలం తో చాలా త్రిల్లింగ్ గా ఉన్న ఈ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో కూడా విడుదల చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ పై పూరి జగన్నాథ్ చార్మి సంయుక్తంగా నిర్మించబోతున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద డబుల్ ఇస్మార్ట్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











