చిరంజీవితో చేతులు కలిపిన పూరీ జగన్నాథ్: ట్విట్టర్‌ ద్వారా ప్రకటించిన మెగాస్టార్

సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి.. అప్పటి నుంచి గతంలో కంటే మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. 'ఖైదీ నెంబర్ 150'తో కమ్‌బ్యాక్ అయిన ఆయన.. అది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే 'సైరా: నరసింహా రెడ్డి' అనే భారీ బడ్జెట్ మూవీని చేశారు. అయితే, ఇది అంతగా ఆకట్టుకోకపోయినా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఇక, అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలను ప్రకటిస్తూ ఈ సీనియర్ హీరో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. ఇలా ఒక్కో సినిమాను కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్‌తో కలిసి 'ఆచార్య' అనే సినిమాను చేసిన విషయం తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. దీంతో ఆయన తన ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఫోకస్ చేశారు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలను కూడా పట్టాలెక్కించేశారు. అందులో 'గాడ్ ఫాదర్' మూవీ ఒకటి. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్‌ తెరకెక్కించిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ గత ఏడాదే మొదలైంది.

Puri Jagannadh Onboard for God Father Movie

స్టార్ హీరో చిరంజీవి నటిస్తోన్న 'గాడ్ ఫాదర్' మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాత్రలకు సంబంధించిన షూటింగ్‌ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ భాగం అయ్యాడు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అలాగే, చిరంజీవి కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.

వాస్తవానికి 'గాడ్ ఫాదర్' మూవీలో పూరీ జగన్నాథ్ కీలక పాత్రను చేస్తున్నట్లు ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. దాన్ని ఇప్పుడు నిజం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో ఈ డైనమిక్ డైరెక్టర్‌కు స్వాగతం పలుకుతోన్న ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు, 'నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేసాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ, అతడి మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే మా పూరీ జగన్నాథ్‌ను ఓ స్పెషల్ రోల్‌తో పరిచయం చేస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చారు.

'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే శక్తిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. అలాగే, నయనతార కూడా ఇందులో నటిస్తోంది. ఈ మూవీని ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X