చేతులెత్తి మొక్కుతున్నా.. మీరే రియల్ హీరోలు.. పూరి జగన్నాథ్ ఎమోషనల్ కామెంట్స్

గత కొన్నిరోజులుగా దిశా హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తాలూకు విషయాలు తెలిసి నిందితులను ఉరి తీయాలంటూ దేశమంతా గొంతెత్తింది. ఈ నేపథ్యంలో దిశా హత్య ఘటన నిందితులను ఎన్‌కౌంటర్ చేశారనే న్యూస్ అందరిలోనూ ఆనందం నింపింది. పోలీసులు చేసిన ఈ ఎన్‌కౌంటర్‌పై పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అత్యాచారం.. యావత్ దేశం ఒక్కటై నినాదాలు

అత్యాచారం.. యావత్ దేశం ఒక్కటై నినాదాలు

నవంబర్ నెల 27న దిశపై నలుగురు నిందితులు అత్యాచారం జరిపి.. అనంతరం ఆమెపై పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. ఈ ఉదంతం గురించి తెలిసి దేశమంతా ఉలిక్కిపడింది. దీంతో దిశ ఘటనలో నిందితులైన ఆ నలుగురినీ బహిరంగంగా ఉరి తీయాలని యావత్ దేశం ఒక్కటై నినాదాలు చేసింది.

Recommended Video

Disha Issue : రేపిస్టుల ఎన్‌కౌంటర్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం ! || Oneindia Telugu
దిశ కేసు విచారణ.. పోలీసుల చర్యలు

దిశ కేసు విచారణ.. పోలీసుల చర్యలు

ఈ కేసు విచారణలో భాగంగా నవంబర్ 28న మధ్యాహ్నం దిశ కేసులో ప్రధాన నిందితులైన ఆ నలుగురినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 29న షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో నిందితుల విచారణ జరిపారు. ఆ తర్వాత 30న నలుగురు నిందితులకు జ్యుడీషియల్‌ కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. ఈనెల 4న నిందితులను కోర్టు పోలీస్‌ కస్టడీకి ఇచ్చింది. 5న చర్లపల్లి జైలులో నిందితులను సిట్‌ విచారించింది. ఎట్టకేలకు నేడు (డిసెంబర్ 6) ఆ నిందితులు ఎన్‌కౌంటర్ కాబడ్డారు.

దిశా నిందితులు.. ఎన్‌కౌంటర్ వివరాలు

దిశా నిందితులు.. ఎన్‌కౌంటర్ వివరాలు

దిశ హత్య కేసులో నిందితులైన నలుగురినీ నేటి (డిసెంబర్ 6) తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య ఎన్‌కౌంటర్‌ చేశారు షాద్ నగర్ పోలీసులు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో ఆ నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసేయడం జరిగింది. ఈ ఉదంతంపై దేశమంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీరే రియల్ హీరోలు.. పూరి జగన్నాథ్

ఈ ఘటనపై డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్పందించారు. పోలీస్ డిపార్టుమెంటుకి సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. ''పోలీసులే నిజమైన హీరోలు. మనకి కస్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు. నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే'' అంటూ పూరి ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X