విజయ్ దేవరకొండతో పూరీ మూవీ.. కాకపోతే కండిషన్స్ అప్లై
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌పై సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హల్‌చల్ చేస్తున్నాడు. చాలాకాలం తర్వాత ఇండస్ట్రీకి మైండ్ బ్లాంక్ అయ్యే హిట్ అందించి.. మరో ప్రాజెక్ట్‌పై దృష్టిపెట్టారు. ఇక తన తదుపరి చిత్రంలో విజయ్ దేవరకొండతో జతకట్టేందుకు పూరీ రెడీ అవుతున్నారట. ఈ వార్త సినీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నది. అయితే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించేందుకు సిద్ధం కాగా, కొన్ని కండిషన్స్‌ను పూరీ పెట్టినట్టు కథనాలు వెలువడుతున్నాయి.
సినీ వర్గాల కథనం ప్రకారం.. విజయ్ దేవరకొండతో నిర్మించబోయే సినిమాకూ పూరీ కనెక్ట్స్ కూడా భాగస్వామిగా ఉంటుంది. నిర్మాణ పనులన్నీ ఛార్మీ చూసుకొంటుందని పూరీ జగన్నాథ్ స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే పూరీ పెట్టిన షరతులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

పూరీ, విజయ్ దేవరకొండ సినిమాను మైత్రీ మూవీస్ బ్యానర్ ఒకే చెబుతుందా అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు క్రాంతి మాధవ్, క్రియేటివ్ కమర్షియల్ రూపొందించే సినిమాపై దృష్టిపెట్టారు. ఈ సినిమా పూర్తికాగానే విజయ్ దేవరకొండ, పూరీ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభమవుతుందనే వార్త వినిపిస్తున్నది.
కాగా, పూరీ చెప్పిన కథ విన్న వెంటనే విజయ్ దేవరకొండ సినిమాను చేసేందుకు ఓకే చెప్పారని, మాస్ మసాలా సినిమా కోసం చూస్తున్న ఆయన వెంటనే ఒప్పుకొన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











