గోవాలో పూరి జగన్నాథ్ స్కెచ్.. అక్కడికెళ్లి ఏం చేయబోతున్నాడో తెలిస్తే షాక్!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేశాడు. ఒకానొక సమయంలో టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త టేస్ట్ చూపిస్తూ వరుస హిట్స్ పట్టేసిన ఆయన.. ఇటీవలి కాలంలో డీలా పడిన సంగతి తెలిసిందే. ఇక పూరి పనైపోయినట్లే అనుకున్న పరిస్థితుల్లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరోసారి వెలుగులోకి వచ్చేడాయన. దీంతో ప్రస్తుతం అందరి చూపు పూరి జగన్నాథ్ పైనే ఉంది. ఈ తరుణంలో పూరి గోవా పయనమయ్యాడనే వార్త బయటకు వచ్చింది. అయితే ఆయన గోవా ఎందుకు వెళ్తున్నాడు? పూర్తి వివరాలు చూస్తే..

స్క్రిప్ట్ రెడీ చేయడంలో పూరి స్టైలే వేరు

స్క్రిప్ట్ రెడీ చేయడంలో పూరి స్టైలే వేరు

తాను తీయాలన్న సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేయడంలో, దాన్ని సెట్స్ పైకి తీసుకొచ్చి అనుకున్న సమయంలో అనుకున్న విధంగా అవుట్‌ఫుట్ తీసుకురావడంలో పూరి జగన్నాథ్‌ని మించిన డైరెక్టర్ లేడనే చెప్పుకోవాలి. షూటింగ్ కంటే ముందే ప్రీ ప్రొడక్షన్ లోనే తన స్కెచ్ అంతా సిద్ధం చేసి అనుకున్నది అనుకున్నట్లుగా ప్రెసెంట్ చేయించగల సమర్ధుడు పూరి.

 బ్యాంకాక్ పయనమయ్యే పూరి.. ఇస్మార్ట్‌గా రూటు మార్చేసి

బ్యాంకాక్ పయనమయ్యే పూరి.. ఇస్మార్ట్‌గా రూటు మార్చేసి

స్క్రిప్ట్ పనులు పూర్తి చేయడంలో పూరి జగన్నాథ్‌కి మరో ప్రత్యేకత కూడా ఉందండోయ్. ఎక్కువగా తన సినిమాల స్క్రిప్ట్ పనులు పూర్తి చేసేందుకు బ్యాంకాక్ వెళుతుంటారు ఈ డాషింగ్ డైరెక్టర్. కానీ ఈ సారి ఇస్మార్ట్‌గా రూటు మార్చేసి గోవా పయనమయ్యారనేది తాజా సమాచారం.

గోవాకు వెళ్ళడానికి కారణం

గోవాకు వెళ్ళడానికి కారణం

ప్రశాంతంగా, చాలా వేగంగా స్క్రిప్ట్ రూపొందించడం కోసం ఇలా టూర్స్ వేస్తుంటారట పూరి. అయితే బ్యాంకాక్ మినహాయిస్తే ఆయనకి బాగా నచ్చిన ప్రదేశం గోవానే కావడంతో ఈ సారి అటువైపుగా వెళ్ళబోతున్నారట. ఈ మేరకు ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆయన చేయబోయే సినిమా స్క్రిప్ట్ పనులన్నీ అక్కడే పూర్తిచేయనున్నారని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండతో పూరి

విజయ్ దేవరకొండతో పూరి

మరికొద్ది రోజుల్లో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కొత్త సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేయడానికే ఆయన గోవా వెళ్తున్నారట. బౌండెడ్ స్క్రిప్ట్ తోనే ఆయన గోవా నుంచి తిరిగి వస్తాడని సమాచారం. ఈ సినిమాలో మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట పూరి జగన్నాథ్.

ఛార్మితో కలిసి ఎంజాయ్

ఛార్మితో కలిసి ఎంజాయ్

గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ సినిమాల నిర్మాణ పనులన్నీ ఛార్మినే చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమా రూపొందించగా, అది సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో ఛార్మి, ఇతర చిత్ర యూనిట్ తో కలిసి ఈ సినిమా సక్సెస్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు పూరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X