చాలా వెరైటీగా ఉంది.. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’పై పూరి జగన్నాథ్ కామెంట్స్
ఓ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ సరిగ్గా చేయాల్సి ఉంటుంది. సినిమా ప్రచార కార్యక్రమాల్లో టాప్ సెలెబ్రిటీలను భాగస్వామ్యులను చేయాల్సి ఉంటుంది. అలా ఎంత మంది స్టార్స్ సినిమా కోసం ముందుకు వస్తే అంతలా జనాల్లోకి వెళ్తుంది. మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు నిర్మాతగా అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో పవన్ తేజ్ కొణిదెల, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'.
ఇప్పటికే ఈ మూవీ కోసం నాగబాబు, వైఎష్ షర్మిల, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారంతా కదిలి వచ్చారు. ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ట్రైలర్‌ను పూరి జగన్నాథ్ రిలీజ్ చేశాడు. మార్చి 19న రాబోతోన్న ఈ మూవీపై ఇప్పుడు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. తాజాగా పూరి జగన్నాథ్ రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం పూరి మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి.

'ఈ కథలో పాత్రలు కల్పితం' .. టైటిల్ చాలా వెరైటీ గా ఉంది. ట్రైలర్ కూడా బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి..సినిమా కూడా చాలా బాగుంటుంది. వెరైటీ స్టోరీ తో రాబోతున్న సినిమా అని ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తోందంటూ పూరి జగన్నాథ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ.. సినిమా బాగా ఆడాలని కోరుకునే అందరికి కృతజ్ఞతలు తెలిపాడు.


Click it and Unblock the Notifications











