పూరి జగన్నాథ్ కెరీర్‌లో ఇదే తొలిసారి! ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రాజెక్టు అంటేనే అది ప్రత్యేకతల బుట్ట. షూటింగ్ మొదటి రోజు స్టార్ట్ చేసిన ఆయన జర్నీ చివరిదాకా అత్యంత వేగంతో ముందుకు సాగుతుంది. అందుకే అతితక్కువ కాలంలో షూటింగ్ ఫినిష్ చేసే దర్శకుడిగా పేరొందాడు పూరి జగన్నాథ్. హీరో ఎవరైనా సరే ఆయన స్టైల్ ఆఫ్ టేకింగ్, స్పీడ్ ఆఫ్ మేకింగ్ ఏదీ మారదు. సినిమాను ఎంత ఫాస్ట్‌గా అనౌన్స్ చేస్తాడో.. అంతే వేగంగా పూర్తి చేసేసి ప్రేక్షకుల ముందుంచడం పూరికి అలవాటు.
కానీ తన కెరీర్‌లో మొదటిసారి పంథా మారుస్తున్నారట పూరి జగన్నాథ్. విజయ్‌దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఫైటర్' (వర్కింగ్ టైటిల్) కోసం ఎక్కువ రోజుల సమయం తీసుకోబోతున్నారట. ఈ సినిమా షూటింగ్‌ను వందరోజులకు పైగా చేయాలని నిర్ణయించుకున్నారట పూరి. అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఓ బలమైన కారణముందని తెలుస్తోంది.

పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా రూపొందిస్తున్నందున తొందరపాటు తగదని, తన రెగ్యులర్ వేకి భిన్నంగా కాస్త లేట్ అయినా ఫర్వాలేదు గానీ.. సర్వ హంగులు జోడించి రూపొందించాలని ఆయన ఫిక్స్ అయ్యారట. ఇదే నిజమైతే ఓ సినిమా కోసం పూరి జగన్నాథ్.. ఇన్నిరోజులు షూటింగ్ చేయడం ఇదే మొదటిసారి అవుతుందని అంటున్నాయి సినీ వర్గాలు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications











