Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వాటన్నింటికీ 'A'.. ఇది కూడా అదే క్యాటగిరీ.. ఆ పవరేంటో చూపిస్తాం: ఛార్మి
Recommended Video
హీరోయిన్ ఛార్మి నిర్మాతగా కూడా ప్రేక్షకులకు ఎప్పుడూ టచ్ లో ఉంటూ తన లోని యాక్టీవ్ నెస్ ప్రూవ్ చేసుకుంటోంది. సోషల్ మీడియాలో ఛార్మి ఉన్నంతగా మరెవ్వరూ అందుబాటులో ఉండరేమో!. తాను నిర్మించబోతున్న ప్రతీ సినిమాకు సంబందించిన అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముంగిటకు తీసుకురావడం ఆమె స్టైల్. ప్రమోషన్స్ అనుకుంటారో, లేక అప్డేట్ ఇస్తుంది అనుకుంటారో మీ ఇష్టం అన్నట్లుగా ఛార్మి పోస్టులు ఉంటాయి. ఈ మేరకు తాజాగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమా సెన్సార్ రిపోర్ట్ తెలియజేస్తూ అభిమానుల్లో ఉత్సవాహం నింపే ట్వీట్ పెట్టింది ఛార్మి.
ఇస్మార్ట్ శంకర్.. సెన్సార్ రిపోర్ట్
ఇటీవలే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు ముగించుకొని విడుదలకు సిద్ధమైన చిత్రయూనిట్ తాజాగా సెన్సార్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబందించిన సెన్సార్ విషయంలో చిక్కులు తప్పవని వార్తలు వస్తున్నప్పటికీ, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ సెన్సార్ బోర్డు నుంచి 'A' సర్టిఫికెట్ తెచ్చుకుంది ఇస్మార్ట్ శంకర్ సినిమా.
|
వాటన్నింటికీ 'A'.. ఇది కూడా అదే క్యాటగిరీ
గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు, పోకిరి, బిజినెస్ మాన్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు 'A' సర్టిఫికెట్ తోనే ప్రేక్షకుల ముందుకొచ్చి రికార్డులు తిరగరాశాయి. అయితే ఆ విషయాన్ని గుర్తుచేస్తూ ఇస్మార్ట్ శంకర్ సినిమా అదే క్యాటగిరీ అని ట్వీట్ పెట్టింది ఛార్మి. ఈ మేరకు గురువారం (జులై 18) నుంచి ఇస్మార్ట్ శంకర్ పవరేంటో చూపిస్తాం అని పేర్కొంది.
ఇద్దరు హీరోయిన్లు.. ఊర మాస్
ఇప్పటి వరకు విడుదలైన ఇస్మార్ట్ శంకర్ టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్‌ని బట్టి చూస్తే ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ని ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేయడం ఖాయం అని తెలుస్తోంది. ఇక అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ లతో రామ్ చేసే రొమాన్స్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్, ఇద్దరు హీరోయిన్స్ అందరికీ ఇస్మార్ట్ శంకర్ మంచి పేరు తీసుకొస్తుందని చిత్రయూనిట్ అంటోంది.
ఇస్మార్ట్ శంకర్ మూవీ
పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందింది 'ఇస్మార్ట్ శంకర్' సినిమా. పూరి జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. నిధి అగర్వాల్, నభా నటేష్ ఆయనతో చిందులేశారు. జులై 18 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇస్మార్ట్ శంకర్ మూవీ.