పూరి జగన్నాథ్‌పై అనుమానాలు.. వెలుగులోకి ఆశ్చర్యకర అంశం!
Recommended Video
సరైన హిట్ కోసం మంచి ఫైరింగ్‌లో ఉన్న పూరి జగన్నాథ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఇస్మార్ట్ శంకర్ సినిమా రూపొందిస్తున్నారు. పూరి మార్క్ స్పష్టంగా కనిపించేలా రొమాన్స్, యాక్షన్ అన్నీ కలగలిపి ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే సరిగ్గా రిలీజ్‌కి దగ్గరైన ఈ సమయంలో ఇస్మార్ట్ శంకర్ కథ విషయంలో ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కథ కాపీ అంటూ ఓ యువ రైటర్ ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి పోతే..

టీజర్ చూసిన వెంటనే..
ఓ వైపు ఇస్మార్ట్ శంకర్ సినిమాను రూపొందిస్తూనే ప్రమోషన్ కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తోంది పూరి అండ్ టీమ్. ఈ మేరకు ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. పక్కా మాస్ డైలాగ్స్‌తో రొమాంటిక్ డోస్ పెంచుతూ ఈ టీజర్ కట్ చేశారు. ఇందులో రామ్ క్యారెక్టర్ చాలా డిఫెరెంట్ గా కనిపించింది. అయితే తలలో చిప్ ధరించి రామ్ కనిపించడంతో ఈ సినిమా కాపీ కథ అనే కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి.

అప్పట్లో వచ్చిన హాలీవుడ్ సినిమా కథనే ఇది
గతంలో వచ్చిన హాలీవుడ్ సినిమా 'క్రిమినల్' కథను పోలి ఈ సినిమా ఉందని అంటున్నారు. క్రిమినల్ అనే హాలీవుడ్ సినిమాలో కూడా ఓ హ్యాకర్ ని సీఐఏ ఏజెంట్ వెంటాడుతాడు. కానీ ఏదో రకంగా ఆ ఏజెంట్ హత్యకు గురికావడం, అతడి బ్రెయిన్ లోని మెమరీస్‌ని చిప్ లో ఎక్కించి ఓ క్రిమినల్ బ్రెయిన్ లోకి ఎక్కించడం జరుగుతుంది. అయితే ఇస్మార్ట్ శంకర్ టీజర్‌ని బట్టి చూస్తే ఈ సినిమా కథాంశం దాన్ని పోలి ఉండనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నా కథే అంటూ యంగ్ రైటర్ ఫిర్యాదు
యాడిలా ఉండగా తాజాగా ఇస్మార్ట్ శంకర్ కథ నాదే అంటూ ఓ యంగ్ రైటర్ రచయితల సంఘంలో ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కథను హీరో రామ్ పెదనాన్న అయిన స్రవంతి రవికిషోర్ కు చెప్పానని, ఆ తర్వాత అదే కథను డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాపీ కొట్టి రామ్ తో సినిమా చేస్తున్నారని సదరు రైటర్ ఆరోపిస్తున్నాడు. దీంతో ఈ విషయమై రచయితల సంఘంతో త్వరలో పూరి చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ ఫినిష్
పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ ఫినిష్ అయింది. జులై 18 వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. చిత్రంలో రామ్ హీరోగా నటించగా.. నిధి అగర్వాల్, నభా నటేష్ ఆయన సరసన ఆడిపాడారు.


Click it and Unblock the Notifications











