ఇగో చెప్తున్నా ఈ పాట మాత్రం ఫుల్ వాల్యూమ్‌లో వినాలా! కిరి కిరి చేస్తే..

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు డబుల్ దిమాక్ అనే ట్యాగ్ లైన్ పెట్టిన పూరి.. అదే కోణంలో డబుల్ దిమాక్ ఖరాబ్ అయ్యేలా హీరో రామ్ తో హై వోల్టేజ్ పర్ఫార్‌మెన్స్ చేయించాడు. చాలా కాలం తర్వాత తన పూర్తిస్థాయి మార్క్ కనిపించేలా ఇస్మార్ట్ శంకర్ సినిమాను రూపొందిస్తున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. తాజాగా విడుదలైన ఈ చిత్ర టైటిల్ సాంగ్ ఇస్మార్ట్ శంకర్ స్టామినా ఎలా ఉంటుందో పూర్తిగా చెప్పేసింది.

చెప్తున్నా ఈ పాట మాత్రం ఫుల్ వాల్యూమ్‌లో వినాలా!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ పాటను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ..''ఇగో చెప్తున్నా ఈ పాట మాత్రం ఫుల్ వాల్యూమ్‌లో వినాలా!'' అని యమ కాన్ఫిడెంట్‌గా ట్యాగ్ లైన్ పెట్టాడు. అయితే నిజంగానే ఫుల్ వాల్యూమ్‌లో వింటే ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాను థియేటర్‌లో చూసేందుకు ఒక్క క్షణం కూడా ఆగలేరు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ ఈ పాటలో తన ప్రతాపం అంతా చూపించారు పూరి.

ఊర మాస్.. అబ్బురపరిచే లిరిక్స్

నిజానికి ఇది ఊర మాస్ పాట. కానీ ఈ పాటలో భాస్కర భట్ల అందించిన లిరిక్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. మాస్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తూనే క్లాస్ ఆడియన్స్‌కి కూడా చేరువవుతున్నాయి. ఇక ఇందులో అనురాగ్ కులకర్ణి గానం అబ్బో.. ఓ రేంజ్‌లో ఉంది. మణిశర్మ బాణీలు పాటకు పీక్స్ లోకి తీసుకెళ్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ టైటిల్ సాంగ్ యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

రొమాన్స్ పరంగా చూస్తే.. ఇస్మార్ట్ శంకర్

రొమాన్స్ పరంగా చూస్తే.. ఇస్మార్ట్ శంకర్

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఏకంగా ఇద్దరు హాట్ హీరోయిన్స్‌ని తన మార్క్ రొమాంటిక్ సీన్స్ కోసం సెలెక్ట్ చేసుకున్నారు పూరి జగన్నాథ్. అందులో ఒకరు నిధి అగర్వాల్ కాగా.. మరొకరు నభా నటేష్. ఈ ఇద్దరూ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిన అప్‌కమింగ్ హీరోయిన్స్ కావడంతో వారిని బాగా వాడేసినట్టున్నారు పూరి. ఛార్మి సహకారంతో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రొమాన్స్‌కి పెద్ద పీట వేస్తూ సినిమా రూపొందించారని తెలుస్తోంది.

ఇప్పటికే భారీ క్రేజ్

ఇప్పటికే భారీ క్రేజ్

ఓ వైపు సినిమా షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ మొదలు పెట్టిన ఇస్మార్ట్ శంకర్ టీమ్ ఇప్పటికే భారీ క్రేజ్ కొట్టేసింది. ఇటీవలే ఫస్ట్ లిరికల్ సాంగ్ దిమాక్ ఖరాబ్ చేయగా, ఆ వెంటనే రెండో సాంగ్ ఇస్మార్ట్ శంకర్ కి జిందాబాద్ కొట్టించింది. తాజాగా ఇప్పుడు విడుదలైన టైటిల్ సాంగ్ ఇస్మార్ట్ శంకర్ స్టైల్ ఏంటో తెలియజేసింది. ఈ మూడు పాటలే చిత్రంపై భారీ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ చేశాయి.

'ఇస్మార్ట్ శంకర్' సినిమా

'ఇస్మార్ట్ శంకర్' సినిమా

పూరి జగన్నాథ్ మార్క్ లో రూపొందుతున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమా పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తుండగా.. నిధి అగర్వాల్, నభా నటేష్ ఆయనతో చిందులేస్తున్నారు. జులై 12 వ తేదీ నుంచి పూరి స్టైల్‌లో ఈ ముగ్గురి రొమాన్స్ చూడనున్నారు ప్రేక్షకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X