పూరీ 'జనగణమన'కు షాక్.. ఊహించని విధంగా ప్రేక్షకుల ముందుకు సినిమా..ఏం చేస్తారో?

వర్మ శిష్యుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక మార్క్ ఏర్పాటు చేసుకున్న పూరీ జగన్నాథ్‌కు ఓ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉంది. అదే జనగణమన. ఈ సినిమా తెరకెక్కించాలని ఎప్పటి నుంచో ఆయన కళలు కంటున్నాడు. కానీ ఎందుకో ఏమో తెలియదు కానీ ఏళ్ల తరబడి వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కేందుకు సమయం ఆసన్నమవగా అనుకోకుండా ఈ సినిమాకు షాక్ తగిలింది. ఆ వివరాల్లోకి వీలైతే

జనగణమన అనే ఓ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌

జనగణమన అనే ఓ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌

సినీ ఇండస్ట్రీలో డ్రీమ్‌ అనేది సర్వసాధారణంగా వినిపించే పదం. డ్రీమ్‌ ప్రాజెక్ట్‌, డ్రీమ్‌ కాన్సెప్ట్‌, డ్రీమ్‌ రోల్‌, డ్రీమ్‌ కాంబినేషన్‌ అనే వాటి మీద తరచూ వినిపిస్తుంటాయి. అలా పూరీ జగన్నాథ్‌కు కూడా జనగణమన అనే ఓ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉంది. ఈ సినిమా మహేష్ బాబుతో తెరకెక్కించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. కానీ వాయిదా పడుతూనే ఉంది.

జనగణమన..'

జనగణమన..'

అయితే ఇక మహేష్ తో కుదరదు అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఎట్టకేలకు ఈ సినిమాను విజయ్ దేవరకొండతో మొదలు పెట్టనున్నట్టు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు పూరీ. ఆ మధ్య చార్మీ కౌర్‌.. పూరీ మాట్లాడిన ఆయోను రిలీజ్‌ చేసింది. 'ఇప్పుడే లైగర్‌ షూటింగ్‌ పూర్తైంది.. ఈ రోజుతో జనగణమన..' అంటూ త్వరలోనే ఈ సినిమా మొదలు పెట్టనున్నట్లు హింట్‌ కూడా ఇచ్చారు పూరీ.

జోరుగా ప్రీ ప్రొడక్షన్

జోరుగా ప్రీ ప్రొడక్షన్

ఇక ఆయన చేస్తున్న లైగర్ ఆగస్ట్ 25న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయిన వెంటనే సినిమా షూట్ కు వెళ్ళబోతున్నట్టు టాక్. ఏప్రిల్ నుంచే రెగ్యులర్ షూట్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం జనగణమన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతోంది. ఆగస్ట్ 25న లైగర్ పూర్తి అయ్యే నాటికి, జనగణమన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

జనగణమన అనే మలయాళ సినిమా

జనగణమన అనే మలయాళ సినిమా

ఇదంతా ఇలా ఉంచితే దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న జన గణ మన సినిమా 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇది అదే పేరుతో పాన్-ఇండియా రేంజ్ లో విడుదల అవుతుంది. అయితే ఇప్పుడు అదే టైటిల్‌తో జనగణమన అనే మరో చిత్రం రూపొందుతోంది . ఇది పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలలో మలయాళ చిత్రం.

ఒక నెల ముందే

ఒక నెల ముందే

ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంకా నెల రోజుల ముందు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉండడం మరింత షాక్‌ని కలిగిస్తోంది. పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండల 'జన గణమన' సినిమా ఇంకా షూటింగ్‌ కూడా మొదలు కాలేదు. ఒకవేళ ఈ సినిమా ప్రకటన వస్తే తమ సినిమాకు ఇబ్బంది అని ముందే రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పూరీ ఏడాది జనగణమన కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లైగర్ కోసం పొడవాటి జుట్టుతో కనిపించిన విజయ్.. జనగణమన కోసం మిలిటరీ హెయిర్ కట్ లోకి మారిపోనున్నాడని టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X