అట్రాక్ట్ చేస్తున్న పూరి ఆఫర్.. ఆచరణలో సాధ్యమేనా..?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ట్విట్టర్ లో తాను చెప్పినట్లుగా చేస్తే మిమ్మల్ని ఫాలో అవుతా.. అని ట్వీట్ చేశారు. ఆయన చెప్పింది పెద్ద పనేం కాదులెండి! జస్ట్ ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ ని రీ ట్వీట్ చేయడమే. అలా రీ ట్వీట్ చేసిన వారిని తాను ఫాలో అవుతానని పేర్కొన్నాడు. అయితే ఆయన పెట్టిన ట్వీట్ ఏంటి? దాన్ని రీ ట్వీట్ ఎందుకు చేయమంటున్నాడు? చేస్తే నిజంగానే ఫాలో అవుతాడా? అని నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు.

ఈ రోజు మైఖేల్ జాక్సన్ పదో వర్థంతి. అయితే మైఖేల్ జాక్సన్ అభిమాని అయిన పూరి జగన్నాథ్.. మైఖేల్ జాక్సన్ షాడో పిక్ షేర్ చేస్తూ దీన్ని రీ ట్వీట్ చేయండని అభ్యర్థించాడు. ఈ మేరకు తాను మైకేల్ జాక్సన్ వీరాభిమానిని అని, మిగిలిన అతని ఫ్యాన్స్ అందరినీ తాను ఫాలో అవుతానని పేర్కొన్నాడు. అలా కావాలంటే జస్ట్ మీరు చేయాల్సింది.. ఈ ట్వీట్ రీ ట్వీట్ చేయడమే అని తెలిపాడు. దీంతో వేలల్లో నెటిజన్స్ పూరి పెట్టిన ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తున్నారు. అయితే అన్ని వేలమందిని పూరి ఫాలో కావడం సాధ్యమేనా? అనే సందేహం తడుతోంది. ఇందులో ఎదో కొంతమందినైతే ఫాలో కావొచ్చు కానీ అందరినీ ఫాలో కావడం సాధ్యంకాని పని అని తెలుస్తోంది. రీ ట్వీట్స్ అయితే బాగానే అవుతున్నాయి.. చూడాలి మరి పూరి చివరకు ఎంత మందిని ఫాలో అవుతాడో! ఎంత మందికి హాండిస్తాడో!

Puri Jagannadhs Special Offer For Netijans

మరికొద్ది రోజుల్లోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్‌ బ్యానర్స్ పై పూరీ జగన్నాథ్‌, చార్మి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. చిత్రంలో ఎనర్జిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. ఆయన సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X