హాట్ బ్యూటీతో విజయ్ దేవరకొండ.. ఫోటో బయటపెట్టిన పూరి జగన్నాథ్.. భలే స్కెచ్!

Recommended Video

Ananya Pandey To Romance With Vijay Devarakonda | Filmibeat Telugu

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో హాట్ బ్యూటీ మచ్చటలాడుతోంది. ఇద్దరూ కలిసి అలా అలా జాలీగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. తాజాగా ఈ పిక్స్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బయటపెట్టి సర్‌ప్రైజ్ చేశారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇంతకీ ఎవరా హాట్ బ్యూటీ? విజయ్ తో ఎక్కడ జాలీగా టైమ్ స్పెండ్ చేస్తోంది? వివరాల్లోకి పోతే..

విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్

విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హావభావాలను పండిస్తూ తన స్టైల్ ఆఫ్ టేకింగ్‌లో అలరించేలా సూపర్ మసాలా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు పూరి జగన్నాథ్. ఇటీవలే ఈ కథను సెట్స్ పైకి తీసుకొచ్చారు.

ముంబైలో.. ప్రణాళిక ప్రకారమే అంతా

ముంబైలో.. ప్రణాళిక ప్రకారమే అంతా

జనవరి 20 వ తేదీన ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభించారు. ఈ సినిమా కోసమై పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు పూరి. ఇస్మార్ట్ శంకర్ లాంటి గ్రాండ్ సక్సెస్ తరువాత పూరి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.

ఆమెతో విజయ్ దేవరకొండ.. పూరి టీమ్ ప్లాన్

ఆమెతో విజయ్ దేవరకొండ.. పూరి టీమ్ ప్లాన్

బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటించనుంది. తాజాగా ఈ బ్యూటీ సెట్స్ పైకి వచ్చేసింది. ఇప్పటినుంచి విజయ్ దేవరకొండ- అనన్య పాండే నడుమ సాగే రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించనుందట పూరి టీమ్.

గ్లామర్ బ్యూటీ.. పూరి జగన్నాథ్ పోస్ట్

గ్లామర్ బ్యూటీ.. పూరి జగన్నాథ్ పోస్ట్

ఈ మేరకు అనన్య పాండేకు వెల్‌కమ్ చెబుతూ సెట్స్ నుంచి కొన్ని పిక్స్ షేర్ చేశాడు పూరి. ఇందులో స్లీవ్ లెస్ వేసుకొని అనన్య పాండే ఫుల్ గ్లామరస్‌గా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ బనియన్, షార్ట్ ధరించి ఆమెతో ఉల్లాసంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 పాన్ ఇండియా మూవీ..

పాన్ ఇండియా మూవీ..

ధర్మ ప్రొడక్షన్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో ఈ సినిమా తెరకెక్కనుంది. కరణ్ జోహార్, ఛార్మి నిర్మాణ సారధ్యంలో భారీ ఎత్తున ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి బాక్సర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X